పాఠశాల నుంచి విద్యార్థులను తీసుకొస్తున్న ఆటో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
పాఠశాల నుంచి విద్యార్థులను తీసుకొస్తున్న ఆటో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా.. విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటన నగరంలోని హబ్సిగూడలో శుక్రవారం చోటుచేసుకుంది. స్కూల్ పిల్లలను తీసుకొస్తున్న ఆటో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో.. ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా.. చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు చిన్నారులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమచారం అందించారు.