అదసలు ఆటోనేనా? స్కూల్‌ పిల్లలను కుక్కేసి మరీ.. | Tamil Nadu: School Children Cooped Auto Video Viral | Sakshi
Sakshi News home page

Viral Video: ఆటోలో స్కూల్‌ పిల్లలను జంతువుల్లా కుక్కేసి మరి..

Published Thu, Mar 31 2022 11:17 AM | Last Updated on Thu, Mar 31 2022 11:17 AM

Tamil Nadu: School Children Cooped Auto Video Viral - Sakshi

చెన్నై: పిల్లలను బడులకు పంపే తల్లిదండ్రులు.. వాళ్ల భద్రత విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటారా?. అయినా కూడా ఎక్కడో ఒక దగ్గర నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.  తాజాగా తమిళనాడులో ఓ ఘటనకు సంబంధించిన వీడియో ట్విటర్‌, ఫేస్‌బుక్‌లో విపరీతంగా వైరల్‌ అవుతోంది. 

ఒక స్కూల్‌ ఆటోలో పిల్లలను జంతువుల్లాగా కుక్కేసి మరీ తీసుకెళ్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. బయట గ్రిల్‌ నుంచి చూస్తే..  ఒకరిపై మరొకరు నిల్చుని, వేలాడుతూ బడికి వెళ్తున్నారు. మరోపక్క ఓపెన్‌ వైపు కూడా ఒకరి మీద మరొకరు ఇరుక్కుగానే కూర్చుని ఉన్నారు. ఇది చూసి ఓ వ్యక్తి.. అదంతా వీడియో తీశాడు. అంతటితోనే ఆగకుండా.. అక్కడే ఉన్న టీచరమ్మను ‘ఏంటి ఇదంతా?’ అని నిలదీశాడు.

అయితే ఆమె మాత్రం ఏదో సర్దిచెబుతూ.. అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుంది. టెంకాశీలో జరిగిన ఈ వీడియో వైరల్‌ అయ్యి.. మీడియాకు చేరింది. తమిళనాడులో తాజాగా ఓ విషాద ఘటన జరిగింది. చెన్నైలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌ ఆవరణలో.. మ్యూజిక్‌ వింటూ స్కూల్‌ బండి నడిపిన ఓ డ్రైవర్‌, ఎనిమిదేళ్ల చిన్నారిని చిదిమేశాడు. ఈ నేపథ్యంలో.. తాజా వీడియో ఘటన తల్లిదండ్రుల్లో మరింత ఆగ్రహానికి కారణమైంది.

మరోపక్క వైరల్‌ అయిన ఈ వీడియోపై దర్యాప్తు చేయిస్తామని, స్కూల్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఇంకోపక్క పిల్లలను ఇలా ప్రైవేట్‌ వాహనాల్లో పంపేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలని పలువురు నెటిజన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.

సన్‌ న్యూస్‌ సౌజన్యంతో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement