
ఇరుగుపొరుగు పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికొచ్చాక చలాకీగా ఆటల్లో మునిగిపోతారు, గెంతుతారు, గోలచేస్తూ ఆనందం పొందుతారు... ఇలా సంతోషించే వారిని, ఇంటì నుంచే కొంతమంది పిల్లలు చూస్తుంటారు. ఎందుకంటే వాళ్ల ఇంట్లో బాగా స్ట్రిక్ట్. పిల్లలను బయటకు రానివ్వరు... ఆటలాడనివ్వరు. వారిని కేవలం పుస్తకాలకే పరిమితం చేయాలనుకుంటారు. వీరి తల్లిదండ్రులు వారివారి వృత్తుల్లో బిజీగా ఉండటం వల్ల పిల్లల్ని గమనించే సమయం వారికి దొరకదు. దీంతో స్కూలు నుంచి ఇంటికొచ్చాక ఏమిచేయాలో తెలియక పిల్లలు అయోమయంలో పడతారు. పట్టించుకునేవారు లేక తల్లడిల్లుతారు... స్కూలు నుంచి ఇంటికొచ్చిన పిల్లలను మీరెలా గమనిస్తున్నారు? లీజర్ టైంలో వారితో ఎలా గడుపుతున్నారు?
1. పిల్లలను బయటకి తీసుకెళతారు. వారిలో నాలెడ్జ్ (మేధను పెంచే గేమ్స్, బుక్ రీడింగ్ మొదలైనవి) పెంచేందుకు వివిధరకాలుగా ప్రయత్నాలు చేస్తారు.
ఎ. అవును బి. కాదు
2. ఉదాయాన్నే పిల్లలను నిద్రలేపి వారిలో యాక్టివ్‌నెస్ పెంచుతారు. ఎక్కువసేపు పడుకోనివ్వరు.
ఎ. అవును బి. కాదు
3. పిల్లలతో పాటు పాఠశాలకు వెళ్ళటమన్నా, వారి యాక్టివిటీస్‌లో పాలుపంచుకోవట మన్నా ఉత్సాహం చూపుతారు.
ఎ. అవును బి. కాదు
4. పిల్లలకు హోంవర్క్‌లో సహాయం చేస్తారు.
ఎ. అవును బి. కాదు
5. పిల్లలకు కొత్తకొత్త క్రేయాన్స్, పెయింట్స్, పుస్తకాలు కొనిస్తుంటారు.
ఎ. అవును బి. కాదు
6. పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లకు తప్పక హాజరవుతారు.
ఎ. అవును బి. కాదు
7. స్కూలు నుంచి ఇంటికొచ్చిన పిల్లలకు రొటీన్ పనులను చెప్పి బోర్ కొట్టించరు.
ఎ. అవును బి. కాదు
8. లంచ్‌లో పిల్లలకు ఇష్టమైన, బలమైన ఆహారాన్ని ఇచ్చేలా చూస్తారు.
ఎ. అవును బి. కాదు
9. పిల్లలు ఎక్స్‌ట్రాకరికులర్ యాక్టివిటీస్‌లో పాల్గొనేలా చూస్తారు.
ఎ. అవును బి. కాదు
10. పాఠశాల నుంచి ఇంటికొచ్చిన పిల్లలను ప్రేమతో దగ్గరకు తీసుకుంటారు. వారి సందేహాలు తీర్చుతారు.
ఎ. అవును బి. కాదు
‘ఎ’ లు ఆరు దాటితే పిల్లలను పాఠశాలకే పరిమితం చేయాలని అనుకోరు. స్కూల్ అయిపోయాక కూడ వారి గురించి శ్రద్ధ తీసుకుంటారు. దీనివల్ల పిల్లలు త్వరగా మెచ్యూరిటీ సాధిస్తారు. ‘బి’ లు ఆరు దాటితే పాఠశాల అనంతరం లేదా పాఠశాల బయట పిల్లల గురించి మీరు సరిగా పట్టించుకోరు. పాఠశాలే పిల్లలకు అన్ని విషయాలు నేర్పిస్తుందని అపోహ పడుతుంటారు. స్కూల్లో పిల్లలు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఇంటిదగ్గర వారి గురించి శ్రద్ధ తీసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులది.
Comments
Please login to add a commentAdd a comment