నారాయణఖేడ్: జిల్లాలోనే వెనుకబడిన మండలమైన నాగల్‌గిద్ద మండల పరిధిలోని మోర్గి మాడల్ స్కూల్ విద్యార్థులు నిత్యం సమస్యలతో సమతమతం అవుతున్నారు. తెలంగాణ, కర్ణాటక సరిహద్దున మోర్గి గ్రామంలో మోడల్ పాఠశాల నిర్మించిన నాటి నుంచి విద్యార్థులు నిత్యం నరకమే అనుభవిస్తున్నారు. మోర్గి మోడల్ స్కూల్, మరియు కళాశాలల్లో కలిపి మొత్తం 600మంది విద్యార్థుల వరకు నిత్యం విద్యాభ్యాసం చేస్తారు. దీంతో వివిధ ప్రాంతా నుంచి విద్యార్థులు పాఠశాలకు రావాలంటే వాహన సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులుల ఎదుర్కొంటున్నారు. నాగల్‌గిద్ద మండలానికి మోర్గి మాడల్ పాఠశాల వచ్చిన కాడినుండి ఇబ్బందులు తప్పడంలేదు.
గత పాలకుల తప్పిదమే..
మెర్గి మాడల్ స్కూల్‌ను నాగల్‌గిద్ద నుంచి మోర్గికి మార్చడంతో ఈ ఇబ్బందులు విద్యార్థులుకు శాపంగా మారినాయి. రూ కోట్లు వెచ్చింది మారుమూల గ్రామంలో భవనం నిర్మించడంతో ఇలాంటి పిరిస్థతులు నెలకొన్నాయి. నాటి పాలకుల తప్పిదం నిర్ణయంవల్లె నాగల్‌గిద్ద నుంచి పాఠశాలను మోర్గికి మార్చారు. అక్కడ అయిదు ఎకరాల ప్రభుత్వ భూమిని కెటాయించారు. రూ.కోట్లు వెచ్చించి భవనం నిర్మాణం చేపట్టారు. కాని విద్యార్థులకు మాత్రం సమస్యలు తీరండలేదు.
కలెక్టర్ హామీ ఇచ్చినా తీరని రోడ్డు సమస్య..
గత ఏడాది ప్రారంభంలో విద్యార్థులు తమ పాఠశాలకు నాగల్‌గిద్ద పీడబ్యూడీ రోడ్డునుండి మోర్గి వరకు నాలుగు కిలోమీటర్ల బీటి రోడ్డు అవసరం ఉంది. గతంలో వేసిన పీఎంజీఎస్‌వై రోడ్డు పూర్తిగా చిద్రం కాగా గోతులు ఏర్పడినాయి. రోడ్డుకు మద్యన ఉన్న భారి కల్వర్టు సైతం శిథిలమై కూలిపోయింది. దీంతో వాహనాలు సైతం సక్రమంగా వెళ్లడం లేదు.
విద్యార్థులకు తప్పని ఇబ్బందులు..
మోర్గి మాడల్ పాఠశాలకు నాగల్‌గిద్ద మండలంలోని కరస్‌గుత్తి, కారముంగి, ఔదత్‌పూర్, శేరిదామర్‌గిద్ద, గుడూర్, నారాయణఖేడ్, తదితర గ్రామాలనుండి నిత్యం వందాలాది విద్యార్థులు పాఠశాలకు చేరుకోవాల్సిన పరిస్థితి, దీంతో వారు వివిద ప్రైవేటు వాహనాలను ఆశ్రయించక తప్పడంలేదు. ఇక నారాయణఖేడ్‌నుండి ఆర్టీ అధికారులు ఒక్క పూట బస్సును రెండు ట్రిప్పులుగా ఎమ్మెల్యే చొరవతో వేసిన ఫలితం అగుపించడంలేదు. దీంతో విద్యార్థుల ఇబ్బందులు సైతం తీరడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment