
రాంచీ : ఓ చేత పుస్తకాల సంచి.. మరో చేత విల్లంబులు పట్టుకొని.. అడవి గుండా బిక్కుబిక్కుమంటూ బడికి వెళ్తున్నారు ఈ చిన్నారులు.. జార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టు ప్రాబల్యం తీవ్రంగా ఉన్న చకులియాస్ పోచపాని గ్రామానికి చెందిన విద్యార్థులు వీరు. పాఠశాలకు వెళ్లాలంటే రోజూ అడవి మార్గం గుండా వెళ్లాలి. అక్కడ నక్సల్స్ ఉంటారనే భయం.. ఈ దుర్భర పరిస్థితుల నడుమ కూడా చదువును ఆపకూడదనే సంకల్పంతో ఈ చిన్నారులు విల్లు, బాణాలు, గుల్లేరులు చేత పట్టుకొని బడికెళ్తున్నారు. ఈ ప్రాంతంలో చదవాలన్నా.. తమ ప్రాణాలు రక్షించుకోవాలన్నా.. ఆయుధాలు ఉండాల్సిందేని వారు అంటున్నారు. వారి దీనస్థితిని అద్దం పడుతున్న ఈ ఫొటోలను ఏఎన్‌ఐ ట్వీట్ చేసింది.
#Jharkhand: Children of naxal affected Chakulia's Pochpani village carry bow & arrows to school to protect themselves from Naxals. Local says, "The children have to pass through forest area where a number of naxals have been spotted." pic.twitter.com/TJJlSRsTxG
— ANI (@ANI) November 12, 2018
Comments
Please login to add a commentAdd a comment