
కేరళలోని మలప్పురంలో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. స్కూలు బస్సు కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులపై మంగళవారం ఉదయం ట్రక్కు దూసుకెళ్లింది.
తిరువనంతపురం: కేరళలోని మలప్పురంలో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. స్కూలు బస్సు కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులపైకి మంగళవారం ఉదయం ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులంతా మనిమూలిలోని సీకేహెచ్‌ఎస్‌లోని స్కూలులో చదువుతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ట్రక్కు డ్రైవర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.