స్పెషల్ క్లాస్ ఉందని చెప్పి..
వివరాలు.. రంగారెడ్డి జిల్లా జిల్లేలగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కేశబాగుల శ్రీలత(14), ఎం. శ్రావణి(15), ఎస్. సంధ్యారాణి(15) ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు పాఠశాలలో ప్రత్యేక తరగతులు ఉన్నాయని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరారు. రాత్రైనా తిరిగి రాకపోవడంతో.. వీరి తల్లిదండ్రులు మీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదృశ్యమైన ముగ్గురు విద్యార్థినులు మీర్‌పేట పరిధిలోని హనుమాన్‌నగర్, డీఎన్‌ఆర్ కాలనీ, వెంకటేశ్వర కాలనీలకు చెందిన వారు.