రంగారెడ్డి, తాండూరు రూరల్: పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఓ యువతి ఇంట్లో నుంచి అదృశ్యమైన సంఘటన కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్ ఏఎస్‌ఐ సత్తయ్య వివరాల ప్రకారం.. తాండూరు మండలం జినుగుర్తి గ్రామానికి చెందిన నానాపూరం హన్మంత్, అంజిలమ్మ కుమార్తె రాధిక. కొన్ని రోజులుగా రాధికకు కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం సంబంధం కోసం ఓ గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలోనే రాధిక ఇంట్లో నుంచి పారిపోయింది. అయితే యువతిని తాండూరు మండలం చింతమణిపట్నం గ్రామానికి చెందిన ఆనంద్ తమ కుమార్తెను తీసుకెళ్లినట్లు యువతి తల్లి ఆరోపించింది. దీంతో అతడిపై శుక్రవారం కరన్‌కోట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment