రంగారెడ్డి: బ్యూటీపార్లర్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని వెంకటాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై రవీంద్రనాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపూర్ గ్రామానికి చెందిన డివిటి యాదయ్య కూతురు శ్రీలత(18) ఈనెల 7వ తేదీన బ్యూటీపార్లర్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయలుదేరివెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. కుటుంబీకులు ఆమె కోసం బంధువులు, స్నేహితుల వద్ద వెదికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సోమవారం మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.