అక్షరం కోసం ఆరాటం..
అక్షరం కోసం ఆరాటం..
Published Wed, Aug 31 2016 9:19 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM
కృత్తివెన్ను :
కృత్తివెన్ను మండలంలోని గరిశపూడి ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు ఇలా సాహసం చేయాల్సిందే. ప్రమాదకర పరిస్థితుల్లో రాకపోకాలు సాగించాల్సిందే. ఈ పాఠశాలలో 62 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలకు వెళ్లే ప్రధాన రహదారి చిన్న వర్షానికే చిత్తడిగా మారుతుంది. నడిచేందుకు సైతం సాధ్యంకాదు. దూరంగా వంతెన ఉన్నా, రహదారి బాగాలేక పోవడంతో ఎక్కువ మంది విద్యార్థులు ఇలా కాలువపై స్థానికులు ఏర్పాటుచేసిన తాటిదుంగల మీదుగా స్కూలుకు వెళ్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి పాuý శాలకు వెళ్లే రహదారిని నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
Advertisement