ఫ్రెండ్స్‌తో మాట్లాడింది.. పీక పిసికి చంపాడు | Talking to Other Boys Senior Killed Girl in Delhi | Sakshi
Sakshi News home page

ఫ్రెండ్స్‌తో మాట్లాడింది.. పీక పిసికి చంపాడు

Published Thu, Aug 17 2017 12:32 PM | Last Updated on Sat, Sep 15 2018 5:14 PM

ఫ్రెండ్స్‌తో మాట్లాడింది.. పీక పిసికి చంపాడు - Sakshi

ఫ్రెండ్స్‌తో మాట్లాడింది.. పీక పిసికి చంపాడు

ప్రేమోన్మాదంతో దేశ రాజధానిలో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు.

ఢిల్లీ: ప్రేమోన్మాదంతో దేశ రాజధానిలో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. తన తోటి విద్యార్థులతో మాట్లాడిందన్న కారణంగా ఓ అమ్మాయిని గొంతు నులిపి చంపాడు. బుధవారం సాయంత్రం రోహిణి ప్రాంతంలో ఈ హత్య జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... 17 ఏళ్ల యువతి, 19 ఏళ్ల నిందితుడు సర్థక్‌ కపూర్‌ స్కూల్లో జూనియర్‌. అప్పటి నుంచే ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రస్తుతం యువకుడు బీసీఏ చదువుతుండగా, ఆ యువతి ఫ్లస్‌ టూ చేస్తోంది. వీరిద్దరు రోజు సాయంత్రం రోహిణి పార్క్ లో కలుస్తుండేవారు. అయితే ఈ మధ్య స్కూల్ లో తోటి విద్యార్థులతో ఆమె సన్నిహితంగా ఉంటూ వస్తోంది. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ వాగ్వాదం కూడా చోటు చేసుకునేది. 
 
బుధవారం సాయంత్రం కూడా ఇదే అంశంపై తగువులాడుకోగా, కోపంతో ఆ యువకుడు యువతి పీక పిసికేశాడు. కాసేపటికి యువతి నిర్జీవంగా పడి ఉండటంతో చనిపోయిందని నిర్ధారించుకుని భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు. కూతురు ఇంకా ట్యూషన్ నుంచి రాకపోవటంతో తండ్రి స్నేహితుడైన కపూర్‌ కు కూడా కాల్ చేశాడు. తోటి స్నేహితులకు సమాచారం అదించి తనకేం తెలీనట్లు అందరితోపాటే యువతిని వెతకటం ప్రారంభించాడు. ఇంకోపక్క కూతురి మిస్సింగ్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కపూర్ కదలికలపై అనుమానంతో ప్రశ్నించగా, అసలు విషయం వెలుగుచూసింది. రోహిణి పార్క్ వద్ద యువతి శవాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement