ఘోర ప్రమాదం: 11 మంది బాలికల మృతి
ఇరాన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మృత్యువాతపడ్డారు.
టెహ్రాన్: ఇరాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో11 మంది బాలికలు సహా 12 మంది మృత్యువాతపడ్డారు. ఇరాన్‌లోని షిరాజ్ పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. షిరాజ్‌లో జరిగే క్రీడా, సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడానికి 45 మంది విద్యార్థినులు బస్సులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది అమ్మాయిలతో పాటు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన బాలికలను స్థానిక హాస్పిటల్ కు తరలించారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
కాగా ఇరాన్‌లో రహదారులు బాగున్నప్పటికీ.. ట్రాఫిక్ భద్రత విషయంలో పేలవమైన రికార్డు ఉంది. డ్రైవర్ల నిర్లక్ష్య కారణంగా ప్రతి ఏడాది వేలాదిమంది ప్రమాదానికి గురవుతున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది.