Minister Rajnath Singh
-
రాజ్‌నాథ్ @ అమర్నాథ్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ పర్యటనలో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రెండో రోజు శనివారం ప్రఖ్యాత అమర్నాథ్ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. పవిత్ర గుహలో మంచు శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బివిన్ రావత్, సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ ఎం.ఎం.నరవణే తదితరులు ఉన్నారు. వారంతా దాదాపు గంట పాటు అమర్నాథ్ ఆలయ ప్రాంగణంలో గడిపారు. అమర్‌నాథుడిని ప్రార్థించడం గొప్ప అనుభూతి కలిగించిందంటూ రాజ్‌నాథ్‌సింగ్ ట్వీట్ చేశారు. నార్త్ హిల్ పోస్టును సందర్శించిన రాజ్‌నాథ్ జమ్మూకశ్మీర్ రాష్ట్రం కుప్వారా జిల్లా కెరాన్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట ఉన్న కీలకమైన నార్త్ హిల్ సైనిక పోస్టును రాజ్‌నాథ్‌సింగ్ శనివారం సందర్శించారు. అక్కడి ప్రస్తుత పరిస్థితిని సైనికాధికారులు రాజ్‌నాథ్‌కు వివరించారు. నార్త్ హిల్ పోస్టులో విధుల్లో ఉన్న జవాన్లతో మాట్లాడానని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. వారు అసమాన ధైర్య సాహసాలతో మన దేశాన్ని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుతున్నారని ప్రశంసించారు. -
అంగుళం భూమినీ ముట్టుకోలేరు
లద్దాఖ్: ప్రపంచంలోని ఏ శక్తి కూడా భారత్ నుంచి ఒక్క అంగుళం భూమిని కూడా లాక్కోలేదని, దేశం బలహీనమైంది కానేకాదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. చైనాతో ఘర్షణల నేపథ్యంలో శుక్రవారం లద్దాఖ్ లోని సరిహద్దు ప్రాంతాలను సందర్శించిన ఆయన లుకుంగ్‌లో ఆర్మీ, ఐటీబీపీ జవా న్లను ఉద్దేశించి ప్రసంగించారు. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో చైనాతో తలెత్తిన సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు చర్చలు కొనసాగుతు న్నాయని చెప్పిన ఆయన అవి ఎంత మేరకు విజయవంత మవుతాయో మాత్రం కచ్చితంగా చెప్పలేమని వ్యాఖ్యానించడం గమనార్హం. జూన్ 15న గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన 20 మంది జవాన్ల త్యాగాలను వృథా కానివ్వమని ఆయన అన్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవాణేలతో కలిసి ఒక రోజు లేహ్ పర్యటనకు వచ్చిన రక్షణ మంత్రి పాంగాంగ్ సో సరస్సు తీరంలోని ఓ స్థావరంలో సైనికాధి కారులతో పరిస్థితిని సమీక్షించారు. సైనిక విన్యాసాలను తిలకించిన రాజ్‌నాథ్ లద్దాఖ్ ప్రాంతంలోని స్టాక్నా ప్రాంతంలో శుక్రవారం జరిగిన మిలటరీ సైనిక విన్యాసాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తిలకించారు. ఆర్మీ, వాయుసేనలకు సంబంధించిన ఆపాచీ, వీ5 యుద్ధ హెలికాప్టర్లు, రుద్ర, మిగ్–17 విమానాలతో పాటు ట్యాంకులు, పదాతిదళాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. తమ యుద్ధ సన్నద్ధతను చాటాయి. స్టాక్నా ప్రాంతంలో పారాట్రూపర్లు, జవాన్ల పాటవాన్ని ప్రత్యక్షంగా చూడగలిగానని ట్విట్టర్లో రాజ్నా«ద్ వ్యాఖ్యానించారు. శాంతి కోసం ఏమైనా చేస్తా భారత్ చైనా పరిస్థితిపై ట్రంప్ భారత్, చైనాల మధ్య శాంతి నెలకొనేందుకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపినట్లు వైట్‌హౌస్ ప్రతినిధి ఒకరు ప్రకటించారు. వాస్తవాధీన రేఖ వద్ద ఇరుదేశాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘భారత్, చైనా ప్రజలంటే తనకిష్టమని ట్రంప్ తెలిపారు. ప్రజలకు శాంతిని అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతానని చెప్పారు’’అని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి కేలీ మెక్ఎనానీ విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యను ట్రంప్ విక్టరీ ఇండియన్ అమెరికన్ ఫైనాన్స్ కమిటీ సహాధ్యక్షుడు అల్ మాసన్ స్వాగతించడమే కాకుండా.. గత అధ్యక్షుల మాదిరిగా కాకుండా ట్రంప్ బహిరంగంగా భారత్‌కు మద్దతు తెలిపారని వ్యాఖ్యానించారు. గతంలో అమెరికా అధ్యక్షులు చైనా ప్రయోజనాలు దెబ్బతింటాయేమో అని భారత్‌కు మద్దతుగా నిలిచేందుకు భయపడేవారని, భారత్ అంటే తనకిష్టమని చెప్పగలిగిన ధైర్యం ట్రంప్‌కు మాత్రమే ఉందన్నారు. -
‘రాజ్‌నాథ్ వ్యాఖ్యలు.. బయటపడిన టీడీపీ డ్రామా’
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ సాక్షిగా టీడీపీ-బీజేపీల బంధం మరోసారి బట్టబయలైంది. ఇన్ని రోజులు విడిపోయినట్లు సంకేతాలు ఇచ్చి.. లోపల మాత్రం బలమైన బంధాలు అలానే ఉన్నాయనే విషయం అర్థమౌతుంది. పార్లమెంట్ సమావేశంలో శుక్రవారం కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ వైదొలిగినప్పటికీ.. చంద్రబాబు మాకు మిత్రుడేనని వెల్లడించారు. లోక్‌సభలో రాజ్‌నాథ్ చేసిన వ్యాఖ్యలతో తెలుగుదేశం డ్రామా బయటపడింది. దీనిపై హోదా కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. అంతేకాక రాజ్‌నాథ్ స్టేట్మెంట్పై టీడీపీ ఎంపీలు కనీసం నిరసన కూడా తెలపలేదని వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఆ సమయంలో టీడీపీ నాయకులు రాజ్‌నాథ్ చేసిన స్టేట్మెంట్ను వింటూ కుర్చున్నారని ఆయన పేర్కొన్నారు. గతంలో టీడీపీ-బీజేపీ బంధంపై మేం చెప్పిందే నిజమైందని వైఎస్సార్సీపీ నేత అన్నారు. బీజేపీతో బంధం కొనసాగుతోంది కాబట్టే సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లలేదు. అవిశ్వాసంపై లోపాయికారిగా ముందే మాట్లాడుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. నిధులపై రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతుండగా టీడీపీ ఎంపీలు స్పందించలేదు. దీన్ని బట్టి చూస్తే ఎన్డీఏతో తెగదెంపులు.. టీడీపీ ఆడిన డ్రామా అని వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. -
ప్రభుత్వంలోకి రాకముందే అల్లర్లు!
సాక్షి, న్యూఢిల్లీ : త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక ముందే ఆ రాష్ట్రంలో అల్లర్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర రాజధాని అగర్తలకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెలోనియా పట్టణంలోని రష్యా కమ్యూనిస్టు విప్లవ నాయకుడు లెనిన్ విగ్రహాన్ని సోమవారం సాయంత్రం కాషాయ వర్గాల ‘భారత్ మాతాకీ జై’ అని నినాదాల మధ్య బుల్డోదర్తో కొందరు కూల్చివేశారు. ఈ సంఘటన నేపథ్యంలో పట్టణంలో పలు చోట్ల అల్లర్లు చెలరేగడంతో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు. ఈ సంఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ భారతీయ జనతా పార్టీ అధికారికంగా ఖండించింది. ‘చలో పల్టాయియే’ అనే నినాదంతో లెనిన్ విగ్రహాన్ని కూల్చివేస్తున్న దశ్యాన్ని బీజేపీ సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ సోషల్ మీడియాలో పోస్ట్‌చేసి, ఆ తర్వాత కొంత సేపటికి తొలగించారు. త్రిపుర ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ ‘చలో పల్టాయియే’ అనే నినాదాన్ని ఎక్కువగా ఇచ్చిన విషయం తెల్సిందే. లెనిన్ ఓ విదేశీయుడు, టెర్రరిస్టు లాంటి వాడని, ఆయన విగ్రహాన్ని తొలగిస్తే తప్పేమిటని బీజేపీ పార్లమెంట్ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి స్పందించారు. ఇక రాష్ట్ర గవర్నర్ తథాగథ రాయ్ మరో అడుగు ముందుకు వేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఓ ప్రభుత్వం ఓ పని చేస్తుందని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మరో ప్రభుత్వం ఆ పనిని తుడిచేస్తుందని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. వీరి వ్యాఖ్యలు దేన్ని సూచిస్తున్నాయి. బీజేపీ సంఘ్‌పరివార్ లెనిన్ విగ్రహాన్ని విధ్వంసం చేశాయని స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగా ఉద్రిక్తతలు ఏర్పడి అవి అల్లర్లకు, హింసాకాండకు దారితీస్తాయి. రాష్ట్రంలో శాంతిభద్రలను పరిరక్షించాల్సిన ఓ గవర్నరే బాధ్యతార హితంగా హింసను రెచ్చగొట్టేలా మాట్లాడితే ఎలా? అప్పుడే సోషల్ మీడియాలో లెనిన్ విగ్రహం విధ్వంసం మీద నిప్పంటుకుంది. సమర్థించే, వ్యతిరేకించే మధ్య రచ్చ జరుగోతోంది. ఇప్పటికే ద్రవిడ ఉద్యమానికి మూలకర్తయిన పెరియార్ రామస్వామి అంటే పడని బీజేపీ మూకలు తమిళనాడులో ఆయన విగ్రహాలను తొలగిస్తామని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో వాటిని కూల్చేందుకు అల్లరి మూకలు ప్రయత్నిస్తే తమిళనాడు భగ్గు మనదా? మెజారిటీ ప్రజల మద్దతు ఉందనుకుని ఇలాంటి సంఘటనలకు ఎవరు పాల్పడిన 1984 నుంచి 2002 వరకు దేశంలో రక్తపాత సంఘటనలు పునరావతం అవుతాయి. తాజా సంఘటన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించి త్రిపుర గవర్నర్ తథాతథ రావుతో మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు ఎలా మందలించారో తెలియదు. -
విద్యార్థులతోనే ‘సురక్షిత భారత్’
సాక్షి, న్యూఢిల్లీ: పాఠశాల దశ నుంచి భద్రత విషయంలో విద్యార్థులను భాగస్వామ్యం చేయడం వల్ల ‘సురక్షిత భారతదేశం’సాధ్యమవుతుందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) ఏర్పాటై 13 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక సదస్సులో ఆయన ప్రసంగించారు. ఎన్డీఎంఏ వార్షిక థీంగా ‘పాఠశాలల భద్రత’ను ప్రకటించడం మంచి పరిణామం అని అన్నారు. దీని ద్వారా స్కూల్ దశ నుంచి విద్యార్థులను భద్రత విషయంలో భాగస్వామ్యం చేయవచ్చన్నారు. విద్యార్థుల ఉత్సాహం, వారి సృజనాత్మకత విపత్తుల నివారణలో మెరుగ్గా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ సదస్సులో రంగారెడ్డి జిల్లా డీఈవో కె.సత్యనారాయణ రెడ్డి, వనపర్తి డీఈవో సుశీందర్‌రావు పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. పాఠశాలల భద్రత విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాల నివారణకు అనుసరిం చాల్సిన ప్రణాళికలను సదస్సులో వివరించినట్లు వారు తెలిపారు. -
ఆమ్నెస్టీని నిషేధించాలి
బెంగళూరులో బీజేపీ భారీ నిరసన కేంద్రానికి డిప్యూటీ మాజీ సీఎం ఆర్.అశోక్ లేఖ ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టాలి బెంగళూరు : కర్ణాటకలో శాంతిభద్రతల సమస్యకు కారణమైన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని నిషేధించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని పేర్కొం టూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాసినట్లు మాజీ ఉపముఖ్యమంత్రి ఆర్.అశోక్ తెలిపారు. భారత సైనికులకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన వారిని అరెస్టు చేయాలని, అమ్నెస్టీ సంస్థను నిషేధించాలని పేర్కొంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం నిరసనకారులపై జరిగిన లాఠీచార్జ్‌ను నిరసిస్తూ రాష్ట్ర బీజేపీ మహిళామోర్చ విభాగం న గరంలోని ఆనంద్‌రావ్ సర్కిల్ వద్ద శనివారం నిరసనకు దిగింది. ఇందులో ఆ పార్టీ ముఖ్యనేతలైన ఆర్.అశోక్, పీ.సీ మోహన్, సురేష్‌కుమార్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తప్పు చేసిన వారిని వదిలి ఆ తప్పును ప్రశ్నించిన వారిపై అధికార కాంగ్రెస్ పార్టీ కక్షకట్టిందన్నారు. అందువల్లే భారత సైనికులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వారితో పాటు అందుకు కారణమైన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్పై దేశద్రోహం కేసు నమోదైనా ఇప్పటి వరకు సదరు కేసులో ఎవరిని అరెస్ట్ కూడా చేయలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నింటినీ వివరిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాసామని పేర్కొన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ లేదా ఏదేని స్వతంత్ర సంస్థతో ఈ విషయంపై విచారణ జరిపించి ఘటనకు కారణమైన వారిని చట్టం ప్రకాశం శిక్షించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఏబీవీపీ నిర్వహిస్తున్న నిరసనకు మద్దతు తెలిపిన ప్రముఖ న్యాయవాది ప్రమీళనై సర్గి తదితరులు మాట్లాడారు. ఇదిలా ఉంటే ఏబీవీపీ నిరసనల నేపథ్యంలో బెంగళూరులోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఆమ్నెస్టీ తప్పేమీ లేదు ! ఘటన సంబంధించి రాష్ట్ర హోంశాఖ మంత్రి పరమేశ్వర్ శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తప్పు ఏమీ చేయలేదు. కాశ్మీర్ బాధితులకు సాంత్వన చెప్పడంతో పాటు సహాయం అందించడానికి మాత్రమే నగరంలో కార్యక్రమం నిర్వహించింది. ఈ విషయాన్ని ఏబీవీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తూ ఆ సంస్థ దేశద్రోహానికి పాల్పడిందని పేర్కొంటున్నారు. ఇది చాలా తప్పు.’ అని పేర్కొన్నారు. ఇక ఎల్లప్పుడూ విదేశాల్లో ఉండే ప్రధాని నరేంద్రమోదీ దేశంలో అంతర్భాగమైన రాష్ట్రాల్లోని సమస్యల పరిష్కారం పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. -
పాక్ చేరుకున్న రాజ్‌నాథ్
ఇస్లామాబాద్: నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ ఆందోళనల మధ్య సార్క్ దేశాల హోంమంత్రుల సదస్సులో పాల్గొనడానికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ బుధవారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. నేటి నుంచి జరగనున్న సదస్సులో ఆయన పాల్గొననున్నారు. దక్షిణాసియా దేశాల్లో ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు అడ్డుకునే సహకారం కోసం ప్రయత్నిస్తానని రాజ్‌నాథ్ పాక్ పర్యటనకు బయలుదేరే ముందు స్పష్టం చేశారు. దేశాల భద్రత గురించి చర్చించడానికి ఈ సమావేశాలు ఒక మంచి వేదిక అని అన్నారు. భారత్‌లో దాడులకు పాల్పడుతున్న పాక్‌లోని ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైషే- మొహమ్మద్‌ల గురించి రాజ్‌నాథ్ ఈ చర్చల్లో ప్రస్తావించే అవకాశం ఉంది. కాగా రాజ్‌నాథ్ పాక్ పర్యటనపై పాక్‌లో పలు సంఘాలు నిరసన తెలిపాయి. ఇస్లామాబాద్‌లో జరిగిన ఆందోళనలకు హిజ్బుల్ ముజాహిదీన్, యూనెటైడ్ జీహాద్ కౌన్సిల్( యూజేసీ) చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ నేతృత్వం వహించాడు. -
భారత్‌లోనే ముస్లింలు ఎక్కువ
- పాక్‌పై తొలి తూటా పేల్చం: హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్య న్యూఢిల్లీ: పాకిస్తాన్ కంటే ఎక్కువ ఇస్లామిక్ దేశంగా భారత్‌ను పిలవొచ్చని, ముస్లింలు పాక్‌లో కంటే భారత్‌లోనే ఎక్కువ అని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. సరిహద్దు ప్రాంతాన్ని శాంతి కేంద్రంగా మార్చాలని పాక్ రేంజర్స్ ప్రతినిధి బృందానికి పిలుపునిచ్చారు. పొరుగు దేశాలతో భారత్ సుహృద్భావ వాతావరణాన్ని భారత్ కోరుకుంటోందని వెల్లడించారు. పాకిస్తాన్ వైపు మొదటి తూటా కాల్చబోమని తెలిపారు. ఆ దేశం నుంచి శాంతియుత చర్చల దాఖలాలు కనిపించడం లేదని సరిహద్దుపై చర్చలు జరిపేందుకు వచ్చిన పాక్ రేంజర్స్ ప్రతినిధి, డెరైక్టర్ జనరల్ మజ్ ఉమర్ ఫరూక్ బుర్కీ బృందంతో వ్యాఖ్యానించారు. బుర్కీ మాట్లాడుతూ.. దీనిపై తాను సైనిక బలగాల డీజీ హోదాలో వచ్చానని, హోంమంత్రి స్థాయిలో రాలేదని చెప్పారు. భారత హోంమంత్రి సందేశాన్ని తమదేశ నాయకత్వానికి తెలియజేస్తానని తెలిపారు. తమ దేశం కూడా శాంతిని కోరుకుంటోందన్నారు. అపార్థాల కారణంగానో, పొరపాటుగానో కాల్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. భారత్, పాక్ దేశాలు తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజ్‌నాథ్ వివరించారు. -
హైకోర్టు విభజనపై త్వరగా నిర్ణయం తీసుకోండి
* కేంద్ర హోంమంత్రికి టీ అడ్వొకేట్ జేఏసీ, బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధుల వినతి * సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామన్న రాజ్‌నాథ్ సాక్షి, న్యూఢిల్లీ: హైకోర్టు విభజనపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని అడ్వొకేట్ జేఏసీ, బీజేపీ లీగల్‌సెల్ ప్రతినిధి బృందం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర విభజన జరిగి 14 నెలలు దాటుతున్నా ఏపీ, తెలంగాణకు వేర్వేరు హైకోర్టులు లేకపోవడం వల్ల కేసులకు సంబంధించి అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. తెలుగు ప్రజల మధ్య మనస్పర్ధలను దూరం చేయడానికి సామరస్య పూర్వకంగా హైకోర్టును విభజన చేయాలని విన్నవించారు. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, టీజేఏసీ చైర్మన్ కోదండరాం నేతృత్వంలో టీ అడ్వొకేట్ జేఏసీ, బీజేపీ లీగల్‌సెల్ ప్రతినిధి బృందం మంగళవారం సాయంత్రం నార్త్‌బ్లాక్‌లో హోంమంత్రి రాజ్‌నాథ్‌తో భేటీ అయింది. హైకోర్టు విభజన ఆవశ్యకతను మంత్రి దత్తాత్రేయ, కోదండరాం, న్యాయవాదులు వివరించారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలి చేసిన ఏకగీవ్ర తీర్మానాలతో పాటు పార్లమెంటు లోపల, బయట అనేక సందర్భాల్లో హైకోర్టు విభజనపై బీజేపీ హామీలు ఇచ్చిన విషయాన్ని రాజ్‌నాథ్ దృష్టికి తీసుకెళ్లారు. భేటీ అనంతరం మంత్రి దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడుతూ హైకోర్టు విభజనపై మంత్రి రాజ్‌నాథ్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడతో మాట్లాడి సాధ్యాసాధ్యాలను తెలుసుకుంటానని, అవసరమైతే చట్టసవరణ ప్రతిపాదనలపై కూడా చర్చిస్తామని రాజ్‌నాథ్ చెప్పారన్నారు. మనస్పర్ధలకు మమ్మల్ని బాధ్యులను చేయొద్దు: కోదండరాం హైకోర్టు విభజన ప్రక్రియను తాత్సారం చేయడం వల్ల ప్రజల మధ్య ఉత్పన్నమయ్యే మనస్పర్ధలకు తమని బాధ్యులను చేయొద్దని రాజ్‌నాథ్‌కు స్పష్టం చేశామని టీజేఏసీ చైర్మన్ కోదండరాం చెప్పారు. హైకోర్టు విభజన ప్రక్రియను పూర్తి చేయడానికి ముఖ్యభూమిక నిర్వహించాలని రాజ్‌నాథ్‌ను కోరామన్నారు. హైకోర్టు విభజనపై ప్రధాన న్యాయమూర్తి సేన్ గుప్తా ఇచ్చిన తీర్పు తేనెతుట్టెను కదిపినట్టైందన్నారు. రాజ్యాంగ బద్ధంగా హైకోర్టు ఏర్పాటు అధికారాన్ని సీఎంలకు బదలాయించే విధంగా తప్పుడు తీర్పు ఉందన్నారు. ఉమ్మడి రాజధానిలో రెండు హైకోర్టులు వద్దంటే, అసెంబ్లీ, సచివాలయం, ఇతర విభాగాలు కూడా ఉండవద్దని ఎవరైనా కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉందని, తద్వారా కొత్త సంక్షోభం వస్తుందన్నారు. టీఅడ్వొకేట్ జేఏసీ కన్వీనర్ రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ, బీజేపీ లీగల్‌సెల్ నేత రామచంద్రారావు పాల్గొన్నారు. -
సమస్యలేమీ లేవు: నరసింహన్
న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సమస్యలేమీ లేవని, అంతా ప్రశాంతంగానే ఉందని ఆ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ అన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆ శాఖ కార్యదర్శి ఎల్.సి.గోయల్‌ను ఆయన శనివారం ఢిల్లీలో కలిశారు. పదో షెడ్యూలులో ఉన్న సంస్థల విభజన, ఉద్యోగుల విభజన అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పెద్ద సమస్యలేవీ లేవని, మీడియా పెద్దగా చూపిస్తోందని పేర్కొన్నారు. ఉద్యోగుల విభజన, ఇతర సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారమవుతాయని అభిప్రాయపడ్డారు. -
శాంతి విఘాతమే లక్ష్యంగా..!
పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు * పార్లమెంట్లో హోంమంత్రి రాజ్‌నాథ్ ప్రకటన న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న ప్రశాంత పరిస్థితిని చెదరగొట్టే లక్ష్యంతో పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు చేస్తున్న దాడుల్లో భాగమే బుధవారం నాటి ఉధంపూర్ ఉగ్రదాడి అని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నా రు. ఉగ్రవాదంపై పోరుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. దాడికి సంబంధించి గురువారం పార్లమెంటు ఉభయసభల్లో ఆయన ఒక స్వచ్ఛంద ప్రకటన చేశారు. బందీ గా చిక్కిన ఉగ్రవాదిని విచారించినప్పుడు, వారు భారత్‌లోకి ఎలా వచ్చారు? వారి ప్రణాళిక, లక్ష్యాలు ఏంటి? అనే విషయాలు వెల్లడవుతాయన్నారు. పాక్ నుంచి నెలలో ఐదు చొరబాటు యత్నాలు చోటు చేసుకోగా.. నాలుగింటిని తిప్పికొట్టి, 8 మంది ఉగ్రవాదులను భారత బలగాలు హతమార్చాయన్నారు. ఉధంపూర్ ఘటనను పార్లమెంటుకు వివరిస్తూ..సజీవంగా చిక్కిన ఉగ్రవాది పేరు మొహమ్మద్ నవేద్ యాకూబ్ అని, పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌కు చెందినవాడని తెలిపారు. అతడిని జమ్మూలో అధికారులు విచారిస్తున్నారన్నారు. నవేద్‌తో పాటు ఉగ్రదాడిలో పాల్గొని బీఎస్ఎఫ్ జవాన్ల ప్రతిదాడిలో చనిపోయిన వ్యక్తి పేరు మొహమ్మద్ నొమెన్ అలియాస్ నోమిన్ అని, అతడు పాకిస్తాన్‌లోని బహవల్పూర్కు చెందినవాడని రాజ్‌నాథ్ వివరించారు. టైస్టుల నుంచి రెండు ఏకే 47 తుపాకులు, కొన్ని గ్రెనేడ్లు, కొంత మందుగుండు సామగ్రిని స్వాధీనపర్చుకున్నామన్నారు. ఉగ్రవాదుల దాడిలో బీఎస్ఎఫ్ జవాన్లు రాకీ(హరియాణ), శుభేందు రాయ్(పశ్చిమబెంగాల్) ప్రాణాలు కోల్పోయారని, 14 మంది జవాన్లు గాయపడ్డారన్నారు. మృతుల కుటుంబీకులకు పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని, ఆ ఘటనలో అత్యంత ధైర్యసాహసాలు చూపినవారికి శౌర్య పురస్కారాలందించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఒక ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్న గ్రామస్తుల ధైర్యసాహసాలను ప్రశంసించారు. ఐఎస్ఐ మద్దతుతోనే..!: ఉధంపూర్ ఉగ్రదాడికి పాల్పడినవారు సుశిక్షిత ఆత్మాహుతిదళ సభ్యులని తమ ప్రాథమిక విచారణలో తేలింద ని జమ్మూకశ్మీర్ పోలీసులు వెల్లడించారు. వారి కి పాక్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్(ఐఎస్ఐ)మద్దతుందని స్పష్టమైందన్నా రు. భారత్‌లో ఇటీవలి ఉగ్రదాడుల తీరు చూస్తుంటే.. భారత్‌లోకి ఉగ్రవాదులను పంపే కార్యక్రమాన్ని ఐఎస్ఐ మరింత ఉధృతం చేసినట్లు కనిపిస్తోందని న్యూఢిల్లీలోని అధికార వర్గాలు వ్యాఖ్యానించాయి. గురుదాస్‌పూర్ ఎన్కౌంటర్లో చనిపోయిన ఉగ్రవాదుల వద్ద లభించిన సమాచారం మేరకు పంజాబ్‌లో 2 ఆలయాలు ఒక కాలేజ్సహా 13 చోట్ల దాడులకు వ్యూహాలు సిద్ధం చేసినట్లు తెలుస్తోందన్నారు. ఇంటలిజెన్స్ సమాచారం లేదు: బీఎస్ఎఫ్ ఉధంపూర్ ఉగ్రదాడికి సంబంధించి ఎలాంటి ప్రత్యేక నిఘా సమాచారం తమకు అందలేదని బీఎస్ఎఫ్ డెరైక్టర్ జనరల్ డీకే పాఠక్ తెలిపారు. గత రెండు దశాబ్దాల్లో జమ్ము, శ్రీనగర్ హైవేపై ఇలాంటి దాడి జరగలేదని, అందువల్లే ఈ రహదారిని సాధారణంగా సురక్షితమైనదిగా భావిస్తామన్నారు. సరిహద్దులో చొరబాట్లకు అవకాశమున్న ప్రాంతాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఉధంపూర్ దాడి లో మృతి చెందిన జవాన్లు రాకీ, శుభేందు రాయ్‌లకు జమ్మూ ప్రాంత ఐజీ రాకేశ్ శర్మ నేతృత్వంలో జమ్మూలోని కార్యాలయంలో బీఎస్ఎఫ్ దళాలు నివాళి ఘటించాయి. అనంతరం మృతదేహాలను వారివారి స్వస్థలాలకు పంపించారు. వారిద్దరి త్యాగం సహచరుల ప్రాణాలను కాపాడిందని శర్మ కొనియాడారు. మమ్మల్ని చంపేస్తారు: నవేద్ సజీవంగా పట్టుబడటంతో తమ ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని అతని తండ్రి మొహమ్మద్ యాకుబ్ వాపోయాడు. విచారణలో నవేద్ ఇచ్చిన ఫోన్ నెంబర్‌కు ఓ విలేకరి ఫోన్ చేయగా యాకుబ్ గాబరాపడుతూ దాదాపు 80సెకన్లు మాట్లాడాడు. ‘మమ్మల్ని బతకనివ్వరు. లష్కరే మా వెంటపడుతోంది. సైన్యమూ వెంటాడుతోంది’ అని ఆందోళనతో చెప్పాడు. నవేద్ సజీవంగా పట్టుబడతాడని లష్కరే అనుకోలేదు. అందుకే ఇప్పుడు మమ్మల్ని వెంటాడుతోంద’ని చెప్పాడు. గాబరాపడుతూ ఫోన్ పెట్టేశాడు. మళ్లీ ప్రయత్నిస్తే స్విచాఫ్ చేసి ఉంది. 44 ప్రాణాలు కాపాడిన వీరత్వం * ఒంటరిగా ముష్కరులను ఎదుర్కొన్న కానిస్టేబుల్ రాకీ జమ్మూ: జమ్మూ, శ్రీనగర్ హైవేపై బుధవారం ఉదయం.. బీఎస్ఎఫ్ కాన్వాయ్‌లోని డజనుకు పైగా వాహనాలు జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తున్నాయి. వాటిలో డార్క్‌గ్రీన్ కలర్లో ఉన్న బస్‌లో 44 మంది జవాన్లున్నారు. వారిలో కొందరు సెలవులకు స్వస్థలాలకు వెళ్తున్నవారైతే, మరికొందరు సెలవు ముగించుకుని డ్యూటీకి తిరిగివస్తున్నవారు. వారెవ్వరి వద్ద ఆయుధాల్లేవు. వారికి రక్షణగా ఉన్న కానిస్టేబుల్.. 25 ఏళ్ల రాకీ వద్ద మాత్రమే ఆయుధముంది. ఉధంపూర్ దాటిన తరువాత మిస్రోలీ వద్ద మిగతా వాహనాలకు ఈ బస్సు కాస్త దూరమైంది. ఇంతలో అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన ఇద్దరు సాయుధులు డ్రైవర్‌పై తూటాల వర్షం కురిపించారు. బస్సు టైర్లను పేల్చేశారు. బస్సు వెనుకకు వచ్చి లోపలికి వచ్చేందుకు ప్రయత్నించసాగారు. ఒకవేళ వాళ్లు బస్‌లోకి వస్తే.. పరిస్థితి దారుణంగా ఉండేది. మృతుల సంఖ్య భారీగా పెరిగేది. కానీ ఆ ముష్కరుల ప్రయత్నాన్ని తన యూనిట్లో రాక్ఫోర్స్గా పేరున్న కానిస్టేబుల్ రాకీ సమర్ధంగా తిప్పికొట్టాడు. వారిపై ఎడతెరిపి లేకుండా బుల్లెట్ల వర్షం కురిపించాడు. తన శరీరంలోకి తూటాలు దూసుకుపోతున్నా పట్టించుకోకుండా వీరోచితంగా ఎదురుదాడి కొనసాగించాడు. వారిని బస్‌లోకి రాకుండా నిలువరించాడు. ఇద్దరిలో ఒక టైస్ట్ను తుదముట్టించాడు. మరో టైస్ట్ తన చేతిలోని గ్రెనేడ్‌ను బస్సులోకి విసిరేందుకు ప్రయత్నిస్తుండగా, అందుకు సమయం ఇవ్వకుండా కాల్పులు కొనసాగించాడు. దాంతో ఆ టైస్ట్ చేతిలోని గ్రెనేడ్ బస్సు పక్కగా పడి పేలిపోయింది. దాని శకలాలు గుచ్చుకుని జవాన్లకు గాయాలయ్యాయి. చివరకు, రాకీని ఎదిరించడం అసాధ్యమని అర్థమై, ఆ ఉగ్రవాది పలాయనం చిత్తగించాడు. తమ్ముడు కూడా సైన్యంలోకే! రాకీ మరణంతో ఆయన స్వస్థలం హరియాణ లోని చిన్న గ్రామం రామ్‌గఢ్ మజ్రా చిన్నబోయింది. రెండు వారాల క్రితమే ఇంటికి వచ్చాడంటూ తండ్రి ప్రీత్‌పాల్ గుర్తు చేసుకున్నాడు. దేశంకోసం ప్రాణాలిచ్చిన తన కుమారుడిని చూసి దేశం గర్విస్తోందన్నారు. రాకీ తమ్ముడు రోహిత్ కూడా సైన్యంలో చేరేందుకు ప్రయత్నిస్తుండటం విశేషం. చెల్లి నేహా నర్సింగ్ కోర్సు చేస్తోంది. రెండున్నరేళ్ల క్రితమే రాకీ బీఎస్ఎఫ్లో చేరాడు. -
మోదీ చేయి చాచలేదు
పాక్‌తో స్నేహ సంబంధాల కోసం యత్నించారు: రాజ్‌నాథ్ నాసిక్: ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ ముందు చేయి చాచలేదని, ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాల కోసం ప్రయత్నించారని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. కాల్పుల విరమణను ఆ దేశం ఉల్లంఘిస్తే.. తగిన రీతిలో గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. రష్యాలోని ఉఫాలో మోదీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో భేటీకావడం, అనంతరం కశ్మీర్ అంశం ఎజెండాలో లేకుండా చర్చలు ఉండవంటూ పాక్ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ వ్యాఖ్యానించడంతో దుమారం రేగడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్ మంగళవారం మహారాష్ట్రలోని నాసిక్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘మోదీ పాకిస్తాన్ ఎదుట చేయిచాచలేదు. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాల కోసం ప్రయత్నించారు. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం. ఒకవేళ పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే మన సైన్యం అందుకు దీటుగా బదులిస్తుంది’ అని అన్నారు. అజీజ్ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య జరిగే చర్చలపై ప్రభావం చూపించే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఉఫాలో మోదీ, షరీఫ్‌ల చర్చల తర్వాత వెలువరించిన సంయుక్త ప్రకటన స్ఫూర్తి కొనసాగుతుందని, పాక్‌తో చర్చలు జరుగుతాయని అన్నాయి. ‘చిత్తు కాగితం విలువ చేయదు’ రష్యాలో భారత్-పాక్ ప్రధానుల భేటీపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. పాక్ తన వైఖరి మార్చుకోనప్పుడు ఉఫా చర్చలు కేవలం కంటితుడుపు చర్యే అని విమర్శించింది. అసలు మోదీ ఏ ప్రాతిపదికన ఈ చర్చల నిర్ణయం తీసుకున్నారో వెల్లడించాలని ఆ పార్టీ ప్రతినిధి ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. ఉఫా చర్చల సందర్భంగా విడుదలైన సంయుక్త ప్రకటనకు చిత్తు కాగితం పాటి విలువ లేదన్నారు. రాష్ట్రపతి ఇఫ్తార్‌కు మోదీ దూరం న్యూఢిల్లీ: ప్రధాని మోదీ కిందటి ఏడాదిలాగే ఈసారి కూడా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చే ఇఫ్తార్ విందుకు హాజరుకావడం లేదు. రాష్ట్రపతి భవన్లో బుధవారం ఇఫ్తార్ విందు జరిగే సమయానికి, రాత్రి ఏడుగంటలకు మోదీ ఈశాన్యరాష్ట్రాల సీఎంలతో సమావేశం కానున్నారు. బుధవారం ఉదయం జరిగే నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది. -
బైసన్ గ్రౌండ్స్‌లో సచివాలయం
-
బైసన్ గ్రౌండ్స్‌లో సచివాలయం
మైదానాన్ని ఇవ్వాల్సిందిగా రక్షణ మంత్రిని కోరిన కేసీఆర్ ►అందుకు ప్రత్యామ్నాయంగా స్థలం ఇస్తామని వెల్లడి ►కంటోన్మెంట్లో రోడ్ల విస్తరణకు ఇబ్బందుల ప్రస్తావన ►సానుకూలంగా స్పందించిన రక్షణ మంత్రి పారికర్ ►రాష్ట్రంలో రెండు సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు హామీ ►కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌తోనూ ముఖ్యమంత్రి భేటీ న్యూఢిల్లీ: తెలంగాణ సచివాలయం నిర్మించేందుకు వీలుగా సికింద్రాబాద్‌లోని 60 ఎకరాల బైసన్ గ్రౌండ్స్ స్థలాన్ని ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పార్టీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాలాచారి, రామచంద్రు తేజావత్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంఓ కార్యాలయ ముఖ్య అధికారులతో కలసి సౌత్‌బ్లాక్‌లో పారికర్‌తో సమావేశమమైన కేసీఆర్ ఈ అంశంపై చర్చించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన పారికర్... డిఫెన్స్ ల్యాండ్ ఇచ్చినందుకు ప్రతిగా నిబంధనల ప్రకారం భూమి ఇవ్వాలని సూచించారు. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ ‘మాకు ల్యాండ్‌బ్యాంక్ ఉంది. అందులోంచి మీకు 60 ఎకరాల స్థలం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. మీ అధికారులను పంపండి. గోల్కొండ దగ్గర, లేదంటే ప్రస్తుత కంటోన్మెంట్ వైపు ఉన్న స్థలాలు ఇస్తాం’ అని చెప్పారు. ఈ అంశంపై మరోమారు హైదరాబాద్‌లో ఎస్టేట్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చర్చించుకోవాలని వారిరువురూ నిర్ణయించారు. రాష్ట్రంలో సైనిక్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని కేసీఆర్ కోరగా తెలంగాణలో రెండు సైనిక్ స్కూళ్లు త్వరలోనే మంజూరు చేస్తామని పారికర్ హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ ప్రాంతంలో కొన్ని రోడ్ల విస్తరణలో సమస్యలతోపాటు హైదరాబాద్‌కు వచ్చే గోదావరి నీటి పైప్‌లైన్ ఏర్పాటులో కంటోన్మెంట్ ప్రాంతంలో కొన్ని ఇబ్బందులున్న విషయాన్ని కేసీఆర్...రక్షణ మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ భేటీ అనంతరం ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ అన్ని విషయాలపై రక్షణ మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. హైదరాబాద్‌లోని ఆదిభట్లలో టాటా గ్రూపు హెలికాప్టర్ తయారీ సంస్థకు అవసరమైన అదనపు భూములను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, కేంద్రం శ్రీకారంచుట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’కు సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రితో కేసీఆర్ అన్నట్లు జితేందర్‌రెడ్డి తెలిపారు. మేడ్చల్-నాగ్‌పూర్ జాతీయ రహదారిని బోయిన్పల్లి వద్ద విస్తరించాల్సి ఉందని, కరీంనగర్ రాజీవ్ రహదారి విస్తరణలో భాగంగా జేబీఎస్ బస్‌స్టాండ్ నుంచి నేరుగా కరీంనగర్ రోడ్డులో హకీంపేట్ దాటాక కలిసేలా ఎలివేటెడ్ హైవే వేస్తున్నామని, రోడ్డు వెడల్పు కోసం కొన్ని రక్షణశాఖ భూములు ఇవ్వాలని కేసీఆర్ కోరినట్లు వినోద్‌కుమార్ చెప్పారు. రోడ్ల విస్తరణకు అవసరమైన భూములు కేటాయించేలా స్థానిక అధికారులతో మాట్లాడతానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్నారు. విభజన హామీలు నెరవేర్చండి... ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అన్ని హామీలను వీలైనంత త్వరగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను సీఎం కేసీఆర్ కోరారు. అలాగే తెలంగాణలో పోలీస్‌శాఖను పటిష్టపరిచేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావులతో కలసి నార్త్‌బ్లాక్‌కు చేరుకున్న కేసీఆర్ అరగంటకుపైగా రాజ్‌నాథ్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో పోలీస్‌శాఖ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. పోలీస్ వ్యవస్థ ఆధునీకీకరణలో భాగంగా మెగాసిటీ పోలీసింగ్, మోడ్రనైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ (ఎంపీఎఫ్) కింద నిధులు విడుదల చేయాలని కోరారు. గతంలోనూ భూముల బదిలీ హైదరాబాద్‌లోని కంటోన్మెంట్ భూములను రాష్ట్ర పరిధిలోకి బదలాయించాలన్న సీఎం కేసీఆర్ విజ్ఞప్తులు ఫలిస్తే విశాల మైదానాల్లో కొత్త సచివాలయ నిర్మాణం చేపట్టే అవకాశముంది. విస్తీర్ణపరంగా దేశంలోనే అతి పెద్దదైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో 30 ఎకరాల్లో జింఖానా, 28 ఎకరాల్లో బైసన్ పోలో, 30 ఎకరాల్లో పరేడ్మైదానాలు విస్తరించి ఉన్నాయి. ఈ భూములన్నీ ప్రస్తుతం రక్షణ శాఖ పరిధిలో ఉన్నా యి. 1991లో రక్షణ శాఖ అధీనంలోని 28 ఎకరాల భూమిని పీజీ కళాశాల నిర్మాణం కోసం, 1992లో నందమూరినగర్ కోసం 15 ఎకరాల భూమిని రాష్ట్రానికి కేంద్రం బదిలీ చేసింది. వీటికి బోయిన్‌పల్లిలోని రామన్నకుంటలో ఏడున్నర ఎకరాలు, రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో 40 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి రక్షణ శాఖకు అప్పగించింది. ఇప్పుడు కూడా ఈ మైదానాలను రాష్ట్రానికి ఇస్తే.. పీజీ కళాశాల భూములను సచివాలయ నిర్మాణానికి వాడుకొని వాటిని ఉస్మానియా వర్సిటీకి తరలించే అవకాశముంది. జూబ్లీ బస్‌స్టాప్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, బేగంపేట ఎయిర్‌పోర్టు, మెట్రోరైల్ జంక్షన్ కూడా ఈ మైదానాలకు సమీపంలో ఉన్నందున ఇక్కడ సచివాలయం నిర్మిస్తే అన్నింటికీ అనువుగా ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. కాగా, విస్తీర్ణంతో సంబంధం లేకుండా తాము అప్పగించే భూములకు ఉన్న మార్కెట్ విలువ ఆధారంగా ఇతర ప్రాంతాల్లో ఆ మేరకు భూములను తీసుకోవాలని రక్షణ శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. -
లిఫ్టులో చిక్కుకుని, స్టూలు ఎక్కి..
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఓ లిఫ్టులో ఇరుక్కుపోయారు. తర్వాత ఓ స్టూలు ఎక్కి , పైకప్పు గుండా బయటపడ్డారు. రాజ్‌నాథ్ గురువారం ‘శౌర్య దివస్’లో పాల్గొనేందుకు ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ భవన సముదాయానికి వచ్చారు. గ్రౌండ్‌ఫ్లోర్ నుంచి తొలి అంతస్తులోని ఆడిటోరియానికి లిఫ్టులో వెళ్తూ అందులో చిక్కుకుపోయారు. తనతోపాటు లిఫ్టులో చిక్కున్న తన ఓఎస్డీ బీకే సింగ్, హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదురి, సీఆర్పీఎఫ్ చీఫ్ ప్రకాశ్ మిశ్రాలను ఖాళీ చేయించడానికి తానే చొరవ తీసుకున్నానని ఆయన తర్వాత జరిగిన కార్యక్రమంలో చెప్పారు. ‘బయటికి రావడానికి స్టూలు ఎక్కాల్సి వచ్చింది. తొలుత సీఆర్పీఎఫ్ డీజీ, తర్వాత చౌదరి బయటికి రావాలని, అందరినీ ఖాళీ చేయించాకే నేను రావాలని నిర్ణయించాను. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ప్రతి ఒక్కరూ ఇతరుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పని చేయాలని, మంచి ఆలోచనలతో పని చేయాలని’ అని చెప్పారు. -
వ్యూహం ఘనం
సమాజంలో చివరి వ్యక్తిని చేరుకోవడమే బీజేపీ లక్ష్యం ‘అంత్యోదయ్’ సంకల్పానికి సభ్యుల అంగీకారం ఎల్.కె.అద్వానీ ప్రసంగం లేకుండానే ముగిసిన బీజేపీ జాతీయ సమావేశాలు బెంగళూరు : సమాజంలోని చిట్ట చివరి వ్యక్తిని సైతం చేరుకోవడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తన రా జకీయ వ్యవహారాల తీర్మాణాన్ని రూపొందించింది. ‘అంత్యోదయ్’ సంకల్పంతో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ప్రవేశపెట్టిన రాజకీయ వ్యవహారాల తీర్మానానికి కార్యనిర్వాహక సభ్యుల అంగీకారం లభించింది. ఇక రెండు రోజుల పాటు నగరంలో జరిగిన బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సమావేశాలు శనివారం సాయంత్రం ముగిశాయి. ఈ సందర్భంగా విదేశీ వ్యవహారాల తీర్మానంతో పా టు రాజకీయ వ్యవహారాల తీర్మానాన్ని కార్యనిర్వాహక సభ్యులు అంగీకరించారు. ఇక రాజకీయ వ్యవహారాల తీర్మానంలో కేంద్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, జయాపజయాలపై చర్చ జరిగింది. అంతేకాక భూ స్వాధీన ఆర్డినెన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సభ్యులకు క్షుణ్ణంగా తెలియజేసేందుకు గాను పవర్ పాయింట్ ప్రజంటేషన్ను అందించారు. ఇక పది నెలల కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రారంభించిన కార్యక్రమాలను పార్టీ సమర్థించింది. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యే సందర్భంలో ఏప్రిల్-మే నెలల్లో దేశంలోని అన్ని ప్రాంతాల్లో వార్డు స్థాయిల్లో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు పార్టీ ఆమోదం తెలిపింది. ఇక జాతీయ కార్యనిర్వాహక సమావేశాల ముగింపు సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ కార్యనిర్వాహక సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. 2013లో యూపీ ఏ రూపొందించిన భూ స్వాధీన బిల్లు రైతులకు పూర్తి వ్యతిరేకంగా రూపొందగా, ప్రస్తుతం తాము రూ పొందించిన ఆర్డినెన్స్ రైతులకు పూర్తి స్థాయిలో ప్ర యోజనం చేకూర్చే విధంగా ఉందని ఈ సందర్భం గా ప్రధాని మోదీ కార్యనిర్వాహక సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. ఇక పార్టీని క్షేత్ర సా ్థయి నుంచి పటిష్టం చేసే దిశగా ప్రతి జిల్లా కేంద్రం లోనూ కార్యాలయాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రచించాల్సిందిగా మోదీ సూచించారు. అంతేకా క పార్టీ రూపొందించిన భూ స్వాధీన ఆర్డినెన్స్‌కు సం బంధించి ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసే దిశగా ప్రతి గ్రామ స్థాయికి వెళ్లి కార్యకర్తలు ప్రచారం చేయాల్సిందిగా కోరారు. సమావేశాల అనంతరం సాయంత్రం 5గంటల సమయంలో ప్రధాని మోదీ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అద్వానీ ప్రసంగం లేకుండానే..... ఇక బెంగళూరులో రెండు రోజుల పాటు జరిగిన జా తీయ కార్యనిర్వాహక సమావేశాలు బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ మార్గనిర్దేశక ప్రసంగం లేకుండానే ముగిశాయి. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సమావేశాల్లో అద్వానీ ప్రసంగం లేకపోవడం ఇదే మొట్టమొద టి సారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. జాతీయ కార్యనిర్వాహక సమావేశాల్లో మోదీ ప్రసంగం లేకపోవడంపై ఆయన వర్గానికి చెందిన కొందరు నేతలు సైతం సమావేశంలో తమ అసంతృప్తిని వెల్లగక్కినట్లు తెలుస్తోంది. -
ఏకాభిప్రాయంతో గోవధపై నిషేధం: రాజ్‌నాథ్
ఇండోర్: ఏకాభిప్రాయం ద్వారా దేశంలో గోవధను నిషేధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆదివారమిక్కడ జరిగిన జైనమత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గోవధ అనేది బీజేపీ సిద్ధాంతాలకు ఎప్పుడూ వ్యతిరేకమేనని, అందుకే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై అన్ని పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇదివరకే గోవధను నిషేధించిన విషయాన్ని రాజ్‌నాథ్ గుర్తుచేశారు. జైనమతం అహింసను పాటిస్తుందని, అది దేశ సంస్కృతిపై ఎంతో ప్రభావం చూపిందన్నారు. అహింసా మార్గంలో నడిచినప్పుడే ఉగ్రవాదాన్ని ఓడించి, ప్రపంచ శాంతిని సాధించవచ్చన్నారు. -
రాజకీయ పొత్తులు ముఖ్యం కాదు
దేశ రక్షణే ప్రధానం: హోంమంత్రి రాజ్‌నాథ్ ఆలం వివాదంలోకి గవర్నర్‌ను లాగిన కశ్మీర్ హోంశాఖ ఘజియాబాద్/జమ్మూ: దేశరక్షణ తమ ప్రభుత్వ అతి ప్రాధాన్య అంశమని హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌లో పీడీపీతో పొత్తు దేశ రక్షణ కంటే ముఖ్యం కానే కాదన్నారు. వేర్పాటువాది మసరత్ ఆలం విడుదలపై వివాదం రేగిన నేపథ్యంలో ఆయన స్పందించారు. రాజ్‌నాథ్ మంగళవారం ఘజియాబాద్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడారు. కాగా, కశ్మీర్ సీఎం సయీద్.. రాజ్‌నాథ్‌తో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇకపై సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తామని, బీజేపీని సంప్రదించకుండా ఏ వేర్పాటువాదినీ విడిచిపెట్టబోమని ఆయన అన్నట్లు సమాచారం. ఆలంను మళ్లీ అరెస్ట్ చేసే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. మరోవైపు ఆలం విడుదలపై పార్లమెంటులో రెండో రోజు కూడా విపక్షాలు కేంద్రంపై విరుచుకుపడ్డాయి. సయీద్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి. సయీద్ ప్రభుత్వం మరో 800 మంది వేర్పాటువాదులను విడుదల చేయాలనుకుంటోందని ఆ రాష్ట్ర గవర్నర్ నివేదిక పంపించారన్న వార్తలపై కేంద్రం జవాబివ్వాలంటూ రాజ్యసభలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కాగా, ఆలం విడుదలకు సంబంధించి కశ్మీర్ హోం శాఖ జమ్మూ కలెక్టర్‌సకు రాసిన లేఖ వివాదానికి తెరలేపింది. ఆలం విడుదల ఉత్తర్వులు గవర్నర్ పాలన ఉన్న ఫిబ్రవరిలోనే వెలువడినట్లు ఈ లేఖ స్పష్టం చేస్తోంది. దీంతో ఈ వివాదంలోకి కొత్తగా గవర్నర్ ఎన్ఎన్ వోరా చిక్కుకున్నారు. -
విదేశీయుల కోసం ‘ఈ-వీసా’
ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ న్యూఢిల్లీ: విదేశీ పర్యాటకులను ఆకర్షించి పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఎలక్ట్రానిక్ వీసా సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రారంభించింది. తొలిదశలో అమెరికా, జర్మనీ, ఇజ్రాయెల్‌తోపాటు 43 దేశాలకు చెం దిన పర్యాటకులకు ఈ-వీసా అందుబాటులోకి రానుంది. భారత్‌లో పర్యాటకాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. జీడీపీలో 7 శాతం పర్యాటక రంగం నుంచే వస్తోం దని, దీన్ని రెట్టింపు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ-వీసాను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. విదేశీ పర్యాటకులు ఈ-వీసా కోసం ఆన్లైన్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకుంటే 72 గంటల్లోగా పరిష్కరిస్తారు. రష్యా, ఉక్రెయిన్, బ్రెజిల్, యూఏఈ, జోర్దాన్, కెన్యా, ఫిజీ, ఫిన్‌ల్యాండ్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, సింగపూర్, మారిషస్, మెక్సికో, నార్వే, ఒమన్, ఫిలిప్ఫీన్స్ తదితర దేశాల యాత్రికులకు ఈ సౌకర్యం కల్పించారు. ‘హై రిస్క్’ దేశాలను మినహాయించి దశలవారీగా అన్ని దేశాల పర్యాటకులకు ఈ సౌకర్యం అందుబాటులోకి తెస్తామని రాజ్‌నాథ్ చెప్పారు. ఇప్పటికే ‘వీసా ఆన్ అరైవల్’ సౌకర్యం ఉన్నా కొంత జాప్యం జరుగుతుండటంతో ఈ-వీసా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దేశ పర్యాటక రంగంలో ఇది చరిత్రాత్మక దినమని పర్యాటక శాఖ మంత్రి మహేష్ శర్మ పేర్కొన్నారు. విదేశీ పర్యాటకులకు తగిన భద్రత కల్పించాలని ఆయన కోరగా రాజ్‌నాథ్ సానుకూలంగా స్పందించారు. ఈ సదుపాయం కల్పించాలని దీర్ఘకాలంగా తాము కోరుతున్నట్లు భారత టూర్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు సుభాష్ గోయల్ చెప్పారు. ఈ-వీసా 30 రోజుల పాటు చెల్లుతుంది. ఓ పర్యాటకుడు ఏటా రెండుసార్లు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, కోచి, తిరువనంతపురం, గోవా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఈ-వీసా సేవలను విదేశీ యాత్రికులు వినియోగించుకోవచ్చు. -
అన్ని పార్టీలతో చర్చ!
‘ఢిల్లీ’ సర్కారు ఏర్పాటుపై గవర్నర్ నిర్ణయం న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలపై వివిధ పార్టీల ప్రతినిధులతో చర్చలు జరపాలని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నిర్ణయించారు. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో... ప్రభుత్వ ఏర్పాటు లేదా తిరిగి ఎన్నికలు నిర్వహించే అంశాన్ని తేల్చేందుకు నజీబ్ జంగ్ సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన బుధవారం ఉదయం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. అనంతరం.. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి అనుమతించినందున, జంగ్ కొద్దిరోజుల్లో అక్కడి అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ప్రకటించింది. అయితే.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని మొదటగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించవచ్చని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. బీజేపీ ముందుకు రాకపోతే అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీని, కాంగ్రెస్‌ను ఆహ్వానించవచ్చని పేర్కొన్నాయి. కాగా, ఢిల్లీలో తిరిగి ఎన్నికల నిర్వహణకే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ కూడా ముందుకు రాకపోతే.. ఎన్నికలు నిర్వహించడం తప్పదన్నాయి. కాగా, జంగ్ ఎన్డీయే ప్రభుత్వ తొత్తుగా వ్యవహరిస్తూ.. రాజ్యాంగ పదవికి మచ్చతెచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఢిల్లీలో పరిస్థితిపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆమ్ఆద్మీపార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. -
కాల్పులు కొనసాగుతున్నాయి!
సరిహద్దు వెంట మంగళవారం రాత్రంతా పాక్ దాడులు ఇద్దరు మహిళలు మృతి; 15 మందికి గాయాలు ఫ్లాగ్ మీటింగ్ ఉండదు: భారత్ న్యూఢిల్లీ/జమ్మూ/కర్నాల్(హర్యానా): హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా భారతీయ నేతలు చేస్తున్న హెచ్చరికలను పెడచెవిన పెడుతూ.. పాక్ దళాలు జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంట కాల్పులు, మోర్టా రు దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. బుధవారం నాటి తాజా దాడుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు చనిపోగా, ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు సహా 15 మంది గాయాల పాలయ్యారు. దీంతో గత వారం రోజుల్లో పాక్ కాల్పుల్లో చనిపోయినవారి సంఖ్య ఏడుకు చేరింది. పాక్ దాడులను భారత్ దీటుగా ఎదుర్కొంది. పాక్ క్యాంపులపై ప్రతిదాడులతో బీఎస్ఎఫ్ విరుచుకుపడింది. భారతదళాల ప్రతిస్పందనతో ఒక దశలో పాక్ వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి. భారత్ కాల్పుల్లో గత రెండు రోజుల్లో పాకిస్తాన్ సరిహద్దుల్లో 35 మంది చనిపోయారంటూ పాక్ మీడియా వెల్లడించింది. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై ప్రభుత్వ స్పందన సరిగా లేదంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. త్వరలోనే అన్నీ చక్కబడుతాయంటూ బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంకేతాలిచ్చారు. 192 కిమీల ఐబీ వెంబటి ఉన్న 50 భారత సరిహద్దు కేంద్రాలు, 35 గ్రామాలను లక్ష్యంగా చేసుకున్న పాక్ దళాలు మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు నిర్విరామంగా కాల్పులు జరిపాయి. జమ్మూలోని కంచక్, పర్గ్వాల్ సబ్ సెక్టార్లలో బుధవారం రాత్రి కూడా మూడు దఫాలుగా పాక్ రేంజర్లు భారీ ఎత్తున కాల్పులు జరిపాయి. ఆర్నియాలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం రాత్రి వరకు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దాంతో ఆయా ప్రాంతాల్లోని దాదాపు 17 వేల మంది పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. వారి కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. చిల్లారి గ్రామంపై జరిపిన దాడుల్లో శకుంతలదేవి, ఆమె కోడలు పోలి దేవి మరణించగా, వారి భర్తలు, పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో ఆ గ్రామంలోని వారంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఫ్లాగ్ మీటింగ్ ఉండదు: కాగా, పాక్ సైన్యాధికారులతో ఎలాంటి ఫ్లాగ్ మీటింగ్ ఉండబోదని కేంద్ర హోంశాఖ సహాయమత్రి కిరణ్ రిజుజు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పటికీ.. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారని చెప్పారు. పాక్ కాల్పులకు సరైన జవాబిస్తున్న బీఎస్ఎఫ్, ఆర్మీలను హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. సరిహద్దు గ్రామాల ప్రజలు తమ స్వస్థలాలను వదిలివెళ్లాల్సిన అవసరం లేదన్నారు. పాక్ సైన్యం హస్తం: పాక్ రేంజర్ల కాల్పుల వెనుక పాకిస్థాన్ సైన్యం హస్తం ఉందని ప్రధానమంత్రి కార్యాలయ సహాయమంత్రి జితేంద్రసింగ్ ఆరోపించారు. పాక్ రేంజర్లు కాల్పులు జరిపిన సరిహద్దు ప్రాంతాల్లో జితేంద్ర సింగ్ బుధవారం పర్యటించారు. సరిహద్దు వెంబటి కాల్పులు తీవ్రంగా తీసుకోవాల్సిన అంశమని భారత వైమానిక దళ ప్రధానాధికారి ఎయిర్ మార్షల్ అరూప్ రాహ వ్యాఖ్యానించారు. ఈ వివాదానికి భారత్ సత్వర పరిష్కారం కోరుతోందన్నారు. త్వరలోనే అన్నీ చక్కబడతాయి: మోదీ కాశ్మీర్లో పాక్ కాల్పుల ఉల్లంఘనపై ప్రధానమంత్రి మోదీ స్పందించారు. ‘‘త్వరలోనే అన్నీ చక్కబడుతాయి’ అని వ్యాఖ్యానించారు. 82వ ‘ఎయిర్‌ఫోర్స్ డే’ సందర్భంగా బుధవారం భారతీయ వైమానిక దళ ప్రధానాధికారి ఎయిర్ చీఫ్ మార్షల్ ఉరూప్ సాహా ఏర్పాటు చేసిన ‘ఎట్‌హోం’ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వైమానిక దళ సిబ్బందికి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. కాగా, పాక్ కవ్వింపు చర్యలకు భారత దళాలు తీవ్రంగా స్పందించాయని ఉన్నతస్థాయి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2 రోజుల్లో భారత్ కాల్పుల్లో 35 మంది చనిపోయారన్న పాక్ మీడియావార్తలను రుజువులుగా చూపాయి. కాశ్మీర్ అంశాన్ని తెరపైకి తెచ్చేందుకు ఐరాసలో ప్రయత్నం విఫలం కావడంతో.. ఆ అంశంపై వేడి పెంచేందుకే పాక్ కవ్వింపు చర్యలకు దిగుతోందన్నాయి. -
గవర్నర్‌గిరీ తాత్కాలిక నిలిపివేత
హోంమంత్రి హామీ ఇచ్చినట్టు టీఆర్ఎస్ ఎంపీల వెల్లడి న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో శాంతిభద్రతలపై గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఉత్తర్వులను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్టు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చినట్టు టీఆర్ఎస్ ఎంపీలు వెల్లడించారు. సోమవారం పార్లమెంటు వద్ద టీఆర్ఎస్ లోక్‌సభాపక్షనేత ఏపీ జితేందర్‌రెడ్డి, ఎంపీ బీ వినోద్‌కుమార్‌లు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 సెక్షన్ 8 లోని అంశాలను, తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారాలను లాగేసుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలను హోం మంత్రికి వివరించామని వారు చెప్పారు. శాంతి భద్రతలపై గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ, లోక్‌సభలో వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చినట్టు వారు తెలిపారు. తమ నోటీసును స్పీకర్ తిరస్కరించగా, తాము ఉభయసభలను అడ్డుకున్నామని వారు చెప్పారు. దీంతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు జోక్యం చేసుకుని, రాజ్యసభ నుంచి హోంమంత్రి రాజ్‌నాథ్‌ను లోక్‌సభకు పిలిపించారని వారు వివరించారు. వాయిదా అనంతరం తిరిగి సభ సమావేశమైనపుడు సెక్షన్ 8లోలేని అంశాలను రాజ్‌నాథ్ దృష్టికి తెచ్చినట్టు ఎంపీలు చెప్పారు. ‘ఈనెల 18వ తేదీన జరిగే సమావేశానికి హోంమంత్రి తమను ఆహ్వానించారని, గవర్నర్ ఆదేశాలకు సంబంధించి వెర్బాటమ్ సవరిస్తామని, ప్రస్తు తం హోంశాఖ జారీచేసిన ఆదేశాలను నిలిపివేస్తామని హోం మంత్రి హామీ ఇచ్చారు.’ అని టీఆర్ఎస్ ఎంపీలు వివరించారు. ఒక వ్యక్తి లేదా కొందరు వ్యక్తుల పట్ల ఒక వర్గం విద్వేషపూరితంగా నేరాలు చేస్తే, ఆ నేరాలపైన గవర్నర్ ఆలోచన చేస్తారని సెక్షన్ 8లో ఉందని,అయితే, జాయింట్ సెక్రటరీ జారీచేసిన ఉత్తర్వులు అందుకు భిన్నంగా, పోలీసు అధికారుల బదిలీ లు కూడా గవర్నర్ పరిధిలో ఉంటాయని ఉంద ని ఎంపీలు తెలిపారు. సెక్షన్ 8 ప్రకారం ఉంటే తప్పుపట్టడంలేదని, అందులో లేని అధికారాలను గవర్నర్‌కు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. అసలు సెక్షన్ 8లో ఏముందనే విషయం హోంమంత్రికి కూడా తెలియదని ఎంపీలు వ్యాఖ్యానించారు. రాష్ట్రపునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 8 ని బూచిగా చూపి కేంద్రం రాజ్యాంగాన్ని అతిక్రమించిందని వారు ఆరోపించారు. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నట్టు చెప్పారు. శాంతిభద్రతలపై విశేషాధికారాలను గవర్నర్‌కు ఇచ్చే ఉత్తర్వులను వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. గవర్నర్ గిరీపై ‘ సుప్రీం’కు: ఎంపీ కె.కవిత రాష్ట్రాల అధికారాలను లాక్కోవడానికి కేంద్రం ఇలాగే మొండిగా వ్యవహరిస్తే న్యాయపోరాటం చేస్తామని, హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలపై గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకు వెళతామని టీఆర్ఎస్ ఎంపీ కె.కవిత చెప్పారు. న్యాయం తమవైపే ఉందని, గెలుస్తామన్న నమ్మకముం దని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పార్లమెంటు వెలుపల ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన మొదటి వారంలోనే రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కేంద్రం లాక్కొనే ప్రయత్నం చేసిందని ఆమె ఆరోపించారు. దాన్ని తాము తిప్పికొట్టగా, కొద్దిపాటి మార్పులు, చేర్పులతో హైదరాబాద్‌లో శాంతిభద్రతల అధికారాలను గవర్నర్‌కు ఇవ్వబోతున్నారని చెప్పారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు.రాజ్యాంగంలో గవర్నర్‌కు ఏవైతే అధికారాలు ఉన్నాయో అవే అధికారాలు బిల్లు లో ఉన్నాయని, అంతకు మించి ప్రత్యేక అధికారాలేవీ లేవన్నారు. బిల్లును సాకుగా తీసుకుని కేంద్ర హోంశాఖ రాసిన లేఖ వెనుక తెలంగాణపై కుట్ర ఉందని, దీన్ని తిప్పికొడతామన్నారు. బిల్లులోని నిబంధనల మేరకే గవర్నర్‌కు అధికారాలిచ్చామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లోక్‌సభలో చెప్పారని, కానీ ఆ నిబంధన అలాలేదని కవిత వివరించారు. కేంద్రం ఇలానే మొండిగా ప్రవర్తిస్తే సుప్రీంకు వెళ్తామన్నారు. కేంద్రం ఇచ్చే ప్రతి అంశాన్ని రాష్ట్రాలు అమలు చేయాలని లేదు. రాష్ట్రానికి నచ్చితే అమలు చేయడం జరుగుతుందని ఆమె ఒక ప్రశ్నకు బదులిచ్చారు.