వ్యూహం ఘనం | end of the BJP's national meetings | Sakshi
Sakshi News home page

వ్యూహం ఘనం

Published Sun, Apr 5 2015 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM

వ్యూహం ఘనం

వ్యూహం ఘనం

సమాజంలో చివరి వ్యక్తిని చేరుకోవడమే బీజేపీ లక్ష్యం
‘అంత్యోదయ్’ సంకల్పానికి సభ్యుల అంగీకారం
ఎల్.కె.అద్వానీ ప్రసంగం లేకుండానే     ముగిసిన బీజేపీ జాతీయ సమావేశాలు

 
 
బెంగళూరు :  సమాజంలోని చిట్ట చివరి వ్యక్తిని సైతం చేరుకోవడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తన రా జకీయ వ్యవహారాల తీర్మాణాన్ని రూపొందించింది. ‘అంత్యోదయ్’ సంకల్పంతో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ప్రవేశపెట్టిన రాజకీయ వ్యవహారాల తీర్మానానికి కార్యనిర్వాహక సభ్యుల అంగీకారం లభించింది. ఇక రెండు రోజుల పాటు నగరంలో జరిగిన బీజేపీ జాతీయ కార్యనిర్వాహక
సమావేశాలు శనివారం సాయంత్రం ముగిశాయి. ఈ సందర్భంగా విదేశీ వ్యవహారాల తీర్మానంతో పా టు రాజకీయ వ్యవహారాల తీర్మానాన్ని కార్యనిర్వాహక సభ్యులు అంగీకరించారు. ఇక రాజకీయ వ్యవహారాల తీర్మానంలో కేంద్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, జయాపజయాలపై చర్చ జరిగింది. అంతేకాక భూ స్వాధీన ఆర్డినెన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సభ్యులకు క్షుణ్ణంగా తెలియజేసేందుకు గాను పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను అందించారు.

ఇక పది నెలల కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రారంభించిన కార్యక్రమాలను పార్టీ సమర్థించింది. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యే సందర్భంలో  ఏప్రిల్-మే నెలల్లో దేశంలోని అన్ని ప్రాంతాల్లో వార్డు స్థాయిల్లో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు పార్టీ ఆమోదం తెలిపింది. ఇక జాతీయ కార్యనిర్వాహక సమావేశాల ముగింపు సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ కార్యనిర్వాహక సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. 2013లో యూపీ ఏ రూపొందించిన భూ స్వాధీన బిల్లు రైతులకు పూర్తి వ్యతిరేకంగా రూపొందగా, ప్రస్తుతం తాము రూ పొందించిన ఆర్డినెన్స్ రైతులకు పూర్తి స్థాయిలో ప్ర యోజనం చేకూర్చే విధంగా ఉందని ఈ సందర్భం గా  ప్రధాని మోదీ కార్యనిర్వాహక  సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు.  ఇక పార్టీని క్షేత్ర సా ్థయి నుంచి పటిష్టం చేసే దిశగా ప్రతి జిల్లా కేంద్రం లోనూ కార్యాలయాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రచించాల్సిందిగా మోదీ సూచించారు. అంతేకా క పార్టీ రూపొందించిన భూ స్వాధీన ఆర్డినెన్స్‌కు సం బంధించి ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసే దిశగా ప్రతి గ్రామ స్థాయికి వెళ్లి కార్యకర్తలు ప్రచారం చేయాల్సిందిగా కోరారు. సమావేశాల అనంతరం సాయంత్రం 5గంటల సమయంలో ప్రధాని మోదీ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
 
అద్వానీ ప్రసంగం లేకుండానే.....


ఇక బెంగళూరులో రెండు రోజుల పాటు జరిగిన జా తీయ కార్యనిర్వాహక సమావేశాలు బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ మార్గనిర్దేశక ప్రసంగం లేకుండానే ముగిశాయి. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సమావేశాల్లో అద్వానీ ప్రసంగం లేకపోవడం ఇదే మొట్టమొద టి సారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. జాతీయ కార్యనిర్వాహక సమావేశాల్లో మోదీ ప్రసంగం లేకపోవడంపై ఆయన వర్గానికి చెందిన కొందరు నేతలు సైతం సమావేశంలో తమ అసంతృప్తిని వెల్లగక్కినట్లు తెలుస్తోంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement