పాక్ చేరుకున్న రాజ్‌నాథ్
ఇస్లామాబాద్: నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ ఆందోళనల మధ్య సార్క్ దేశాల హోంమంత్రుల సదస్సులో పాల్గొనడానికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ బుధవారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. నేటి నుంచి జరగనున్న సదస్సులో ఆయన పాల్గొననున్నారు. దక్షిణాసియా దేశాల్లో ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు అడ్డుకునే సహకారం కోసం ప్రయత్నిస్తానని రాజ్‌నాథ్ పాక్ పర్యటనకు బయలుదేరే ముందు స్పష్టం చేశారు.
దేశాల భద్రత గురించి చర్చించడానికి ఈ సమావేశాలు ఒక మంచి వేదిక అని అన్నారు. భారత్‌లో దాడులకు పాల్పడుతున్న పాక్‌లోని ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైషే- మొహమ్మద్‌ల గురించి రాజ్‌నాథ్ ఈ చర్చల్లో ప్రస్తావించే అవకాశం ఉంది. కాగా రాజ్‌నాథ్ పాక్ పర్యటనపై పాక్‌లో పలు సంఘాలు నిరసన తెలిపాయి. ఇస్లామాబాద్‌లో జరిగిన ఆందోళనలకు హిజ్బుల్ ముజాహిదీన్, యూనెటైడ్ జీహాద్ కౌన్సిల్( యూజేసీ) చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ నేతృత్వం వహించాడు.