భారత్‌లోనే ముస్లింలు ఎక్కువ
- పాక్‌పై తొలి తూటా పేల్చం: హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కంటే ఎక్కువ ఇస్లామిక్ దేశంగా భారత్‌ను పిలవొచ్చని, ముస్లింలు పాక్‌లో కంటే భారత్‌లోనే ఎక్కువ అని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. సరిహద్దు ప్రాంతాన్ని శాంతి కేంద్రంగా మార్చాలని పాక్ రేంజర్స్ ప్రతినిధి బృందానికి పిలుపునిచ్చారు. పొరుగు దేశాలతో భారత్ సుహృద్భావ వాతావరణాన్ని భారత్ కోరుకుంటోందని వెల్లడించారు. పాకిస్తాన్ వైపు మొదటి తూటా కాల్చబోమని తెలిపారు.
ఆ దేశం నుంచి శాంతియుత చర్చల దాఖలాలు కనిపించడం లేదని సరిహద్దుపై చర్చలు జరిపేందుకు వచ్చిన పాక్ రేంజర్స్ ప్రతినిధి, డెరైక్టర్ జనరల్ మజ్ ఉమర్ ఫరూక్ బుర్కీ బృందంతో వ్యాఖ్యానించారు. బుర్కీ మాట్లాడుతూ.. దీనిపై తాను సైనిక బలగాల డీజీ హోదాలో వచ్చానని, హోంమంత్రి స్థాయిలో రాలేదని చెప్పారు. భారత హోంమంత్రి సందేశాన్ని తమదేశ నాయకత్వానికి తెలియజేస్తానని తెలిపారు. తమ దేశం కూడా శాంతిని కోరుకుంటోందన్నారు. అపార్థాల కారణంగానో, పొరపాటుగానో కాల్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. భారత్, పాక్ దేశాలు తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజ్‌నాథ్ వివరించారు.