లండన్: బ్రిటన్‌లో పన్నుమోసాలకు పాల్పడిన కొందరు ఆసియా పౌరులు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లలో ఉగ్ర సంస్థ అల్ కాయిదాకు నిధులు సమకూర్చినట్లు అక్కడి మీడియా పేర్కొంది. లండన్, బర్మింగ్‌హామ్, బకింగ్‌హామ్‌షైర్ లాంటి ప్రాంతాల్లో క్రియాశీలంగా ఉన్న ఈ ముఠా పన్ను మోసాలకు పాల్పడటం ద్వారా భారీగా ఆర్జించిందని, అందులో ఒక శాతాన్ని అల్ కాయిదాకు పంపించినట్లు ‘ది సండే టైమ్స్’ పత్రిక వెలుగులోకి తెచ్చింది. ఈ నిధులను మదరసాల నిర్వహణ, ఉగ్ర శిక్షణ, ఇతర ఉగ్ర కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు తెలిపింది.
రెండు దశాబ్దాలుగా పన్నులు ఎగ్గొట్టి అధికారులను మోసగించడంతో పాటు వ్యక్తులు, బ్యాంకులు లక్ష్యంగా క్రెడిట్ కార్డుల రూపంలో 80 మిలియన్ పౌండ్లను కొల్లగొట్టినట్లు పేర్కొంది. యూకేలోని పలు ప్రభుత్వ విభాగాల్లోని అధికారులు, నేతలతో పరిచయాలు పెంచుకుని వారికి లంచాలు ఇచ్చినట్లు తెలిపింది. పాక్ నేతలతో కూడా ఈ గ్యాంగ్‌కు సంబంధాలున్నట్లు తెలిíపింది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ముఠా వివరాలు వెల్లడికాలేదు.
Comments
Please login to add a commentAdd a comment