గృహిణిపై గ్యాంగ్ రేప్ | On the geng rape housewife | Sakshi
Sakshi News home page

గృహిణిపై గ్యాంగ్ రేప్

Published Tue, Feb 3 2015 12:10 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

On the geng rape housewife

లిఫ్ట్ నెపంతో తీసుకెళ్లి అకృత్యం

అత్తాపూర్: మానవ మృగాలు రెచ్చిపోయాయి... లిఫ్ట్ అడిగిన పాపానికి ఓ గృహిణిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  పోలీసుల కథనం ప్రకారం..  ఎల్బీనగర్‌కి చెందిన గృహిణి(26) ఈనెల 28న తన తల్లి అనసూయ,  కూతురు శ్రావణి(8)తో కలిసి అత్తాపూర్ చింతల్‌మెట్‌లోని కల్లు దుకాణానికి వచ్చింది. తల్లిని, కూతురిని ఇంటికి పంపేసి తాను మాత్రం అక్కడే ఉంది.  సాయంత్రం కల్లు దుకాణం నుంచి బయటకు వచ్చిన ఆమె ఇంటికి వెళ్లేందుకు రోడ్డు పక్కన నిలబడింది.

అదే సమయంలో అటుగా బైక్‌వెళ్తున్న ఫర్వీద్ (26)ను లిఫ్ట్ అడిగింది. అతను ఆమెను బైక్‌పై ఎక్కించుకొని మిరాలం చెరువు వైపు తీసుకెళ్లాడు. తన స్నేహితులు వాజిద్(45), ఫసి(28)లకు ఫోన్ చేసి చెరువు వద్దకు రమ్మన్నాడు. ముగ్గురూ కలిసి నిర్మానుష్య ప్రాంతంలో ఆమెపై లైంగికదాడికి పాల్పడి పారిపోయారు. కాగా, బాధితురాలు సోమవారం రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డిని కలిసి దుండగులు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement