తెగిన లిఫ్ట్‌ రోప్‌.. | lift accident | Sakshi
Sakshi News home page

తెగిన లిఫ్ట్‌ రోప్‌..

Aug 15 2016 10:57 PM | Updated on Apr 3 2019 7:53 PM

ఒక అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌ రోప్‌ తెగి ఎనిమిది మంది తీవ్రంగా గాయపడిన సంఘటన భవానీపురంలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం పుష్కరాల సందర్భంగా విజయనగరం చిన్న వీధికి చెందిన 15 మంది శివాలయం సెంటర్లోని భవానీ టవర్స్‌లో ఒక ప్లాట్‌లో సోమవారం దిగారు. గాంధీనగర్‌లోని సబ్‌ రిజస్ట్రార్‌ యోగీంద్రనాథ్‌ ద్వారా భవానీ టవర్స్‌ బిల్డర్‌ బి.అమర్‌నాథ్‌కు చెందిన 5వ ఫ్లోర్‌లోని ఎఫ్‌ఎఫ్‌–2లో వారికి ఆశ్రయం ఇచ్చారు.

విజయవాడ(భవానీపురం): 
ఒక అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌ రోప్‌ తెగి ఎనిమిది మంది తీవ్రంగా గాయపడిన సంఘటన భవానీపురంలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం పుష్కరాల సందర్భంగా విజయనగరం చిన్న వీధికి చెందిన 15 మంది శివాలయం సెంటర్లోని భవానీ టవర్స్‌లో ఒక ప్లాట్‌లో సోమవారం దిగారు. గాంధీనగర్‌లోని సబ్‌ రిజస్ట్రార్‌ యోగీంద్రనాథ్‌ ద్వారా భవానీ టవర్స్‌ బిల్డర్‌ బి.అమర్‌నాథ్‌కు చెందిన 5వ ఫ్లోర్‌లోని ఎఫ్‌ఎఫ్‌–2లో వారికి ఆశ్రయం ఇచ్చారు. 15 మంది బృందం కొంత లగేజ్‌ను తీసుకుని పుష్కర స్నానాలకు బయలుదేరారు. టవర్స్‌లో మూడు లిఫ్ట్‌లు ఉన్నాయి. ఎనిమిది మంది మధ్యలోని లిఫ్ట్‌లో, మిగిలినవారు మరో లిఫ్ట్‌లో ఎక్కారు. 5వ ఫ్లోర్‌ నుంచి లిఫ్ట్‌ ఒక్కసారిగా సెల్లార్‌లోకి దిగబడిపోయింది. ఎనిమిది మందిలో ఒకరికి రెండు కాళ్లు విరిగిపోయాయి. ఒక మహిళకు నడుముకు, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న భవానీపురం పోలీసులు సూర్యారావుపేటలోని సిటీ ఆర్థో హాస్పటల్‌కు బాధితులను తరలించారు. గాయపడిన వారిలో బరిడే సంపత్‌రావు, బొడ్డు సుభద్రాదేవి, బొడ్డు కాళీరావు, పులిపాటి వెంకటరాములు, పులిపాటి కమల, బండారి స్వర్ణకుమారి, వంకాయల అమృతేశ్వరి ఉన్నారు. లిఫ్ట్‌ మరమ్మతులు చేయించమని బిల్డర్‌ అమర్‌నాథ్‌కు చెప్పినా పట్టించుకోలేదని అపార్ట్‌మెంట్‌లోని వారు చెబుతున్నారు. అయితే ఆరుగురు ఎక్కాల్సిన లిఫ్ట్‌లో ఎనిమిది మంది, లగేజి ఉండటంతో ప్రమాదం జరిగి ఉంటుందని కొందరు అంటున్నారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement