‘ఎత్తిపోతల’పై నిర్లక్ష్యం వద్దు
నిజాంసాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు సాగు నీరందించాలనే లక్ష్యంతో పసుపు వాగుపై నిర్మించిన పెద్ద మావంది ఎత్తిపోతల పథకం నిర్వహణను నిర్లక్ష్యం చేయవద్దని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి నీటి పారుదల శాఖ అధికారులకు సూచించారు.
-
వాగునీటిని సద్వినియోగం చేసుకోండి
-
మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి సూచన
బోధన్ : నిజాంసాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు సాగు నీరందించాలనే లక్ష్యంతో పసుపు వాగుపై నిర్మించిన పెద్ద మావంది ఎత్తిపోతల పథకం నిర్వహణను నిర్లక్ష్యం చేయవద్దని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి నీటి పారుదల శాఖ అధికారులకు సూచించారు. వాగు నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సోమవారం ఆయన పెద్దమావంది గ్రామ శివారులోని పసుపు వాగుపై తన హయాంలో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. కాలువలో నీటి పారకాన్ని పరిశీలించి, నీటిపారుదల శాఖ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. ఎత్తిపోతల పథకం ప్రధాన పంప్‌హౌస్‌లో మూడు మోటార్లను నడిపిస్తే.. పథకం కింద స్థిరీకరించిన సుమారు 1,500 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందుతుందన్నారు. పథకాన్ని సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలి
ఎడపల్లి : మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి సోమవారం ఒడ్డేపల్లి గ్రామానికి వచ్చారు. ఆయనను రైతులు కలిసి సమస్యలు వివరించారు. బోధన్‌లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తే నాలుగు మండలాల రైతులు లాభపడతారన్నారు. ఫ్యాక్టరీని తెరిపించడానికి కషి చేయాలని కోరారు. అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తాగునీటి అవసరాల నిమిత్తం చెరువులను నింపుకున్న అనంతరం నీటిని మండలంలోని కుర్నాపల్లి, ధర్మారం, మంగళ్‌పాడ్, ఎడపల్లి(పులి) చెరువులకు తరలిస్తే బాగుంటుందన్నారు. ఈ విషయాలను కలెక్టర్ దష్టికి తీసుకెళ్తానని సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన వెంట గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ శ్రీనివాస్‌యాదవ్, బిల్ల రామ్మోహన్ యాదవ్, నర్సింగ్, సరిదాస్ తదితరులున్నారు.