
నరకం చూశారు...
అది సామర్లకోట రైల్వే స్టేషన్.. విశాఖ- నిజాముద్దీన్ లింక్ ఎక్స్‌ప్రెస్ అప్పుడే మూడోప్లాట్‌ఫాంపైకి వచ్చింది.
- సామర్లకోట రైల్వేస్టేషన్‌లో మొరాయించిన లిఫ్టు
- 15 నిమిషాల పాటు ప్రయాణికుల అవస్థలు
సామర్లకోట : అది సామర్లకోట రైల్వే స్టేషన్.. విశాఖ- నిజాముద్దీన్ లింక్ ఎక్స్‌ప్రెస్ అప్పుడే మూడోప్లాట్‌ఫాంపైకి వచ్చింది. ఆ రైలు నుంచి దిగిన ప్రయాణికులు మొదటి ప్లాట్‌ఫాంపైకి చేరుకునేందుకు అక్కడ ఉన్న లిఫ్టు ఎక్కారు. అయితే అది కాస్తా మధ్యలో నిలిచిపోయింది. దీంతో వారు నరకయాతన అనుభవించారు. సాయంత్రం 5.35కు లిఫ్టులోకి చేరిన వారు 5.50కి తెరుచుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
లిఫ్టు నిలిచిపోవడంతో ప్రాణాలు పోయినంత పని అయ్యిందని ఎన్ అప్పారావు, సత్యవతి, హర్షితలు ‘సాక్షి’కి చెప్పారు. గతంలో రెండు సార్లు ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై ఉన్న లిఫ్టు ఇలానే మొరాయించడంతో ఉన్నతాధి కారులు సుమారు నెల రోజుల పాటు లిఫ్టును నిలిపి మరమ్మతులు చేయించారు.