నాంపల్లి సెంట్రల్ క్రైం స్టేషన్ భవనంలోని లిఫ్టు మొరాయించటంతో అడిషనల్ పోలీస్ కమిషనర్ స్వాతి లక్రా కొద్దిసేపు ఇబ్బంది పడ్డారు.
హైదరాబాద్ : నాంపల్లి సెంట్రల్ క్రైం స్టేషన్ భవనంలోని లిఫ్టు మొరాయించటంతో అడిషనల్ పోలీస్ కమిషనర్ స్వాతి లక్రా కొద్దిసేపు ఇబ్బంది పడ్డారు. శనివారం మధ్యాహ్నం ఆమె గ్రౌండ్‌ఫ్లోర్‌కు వెళ్లేందుకు పైనుంచి లిఫ్టులో వస్తున్నారు. అదే సమయంలో మొదటి, రెండో ఫ్లోర్‌ల మధ్యలో లిఫ్టు ఆగిపోయింది. వెంటనే సిబ్బంది రంగంలోకి దిగారు. దాదాపు పది నిముషాల అనంతరం తిరిగి లిఫ్టును పని చేయించగలిగారు. దీంతో ఏసీపీ స్వాతి లక్రా సురక్షితంగా కిందికి చేరుకున్నారు.