రాగులపాడు లిఫ్ట్‌ ముట్టడిని విజయవంతం చేయండి | Ragulapadu to lift the blockade success | Sakshi
Sakshi News home page

రాగులపాడు లిఫ్ట్‌ ముట్టడిని విజయవంతం చేయండి

Published Tue, Aug 23 2016 12:49 AM | Last Updated on Wed, Apr 3 2019 4:37 PM

రాగులపాడు లిఫ్ట్‌ ముట్టడిని విజయవంతం చేయండి - Sakshi

రాగులపాడు లిఫ్ట్‌ ముట్టడిని విజయవంతం చేయండి

  •   ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి
  • వజ్రకరూరు: ఉరవకొండ నియోజకవర్గంలోని 80 వేల ఎకరాలకు హంద్రీనీవా కాలువ ద్వారా సాగు నీరు అందించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 29న తలపెట్టిన రాగులపాడు లిప్ట్‌ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం చిన్నహోతురు, పొట్టిపాడు గ్రామాల్లో ఆయన రైతులతో సమావేశమయ్యారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  హంద్రీనీవా ఆయకట్టుకు సాగు నీటి సాధనకు ప్రతి ఒక్క రైతు నడుం బిగించాలన్నారు.  నాలుగేళ్ల నుంచి హంద్రీనీవాకు కృష్ణా జలాలు వస్తున్నా ఆయకట్టుకు మాత్రం నీరు అందించలేదని అన్నారు.  మన కళ్లేదుటే హంద్రీనీవా కాలువలో కృష్ణా జలాలు పారుతున్నా మనం ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నామన్నారు.  ఆయకట్టు సాగు నీటి సాధనకు ప్రభుత్వంపై పోరాడితే తప్ప సాగునీటిని సాధించలేమన్నారు.  ప్రభుత్వం వెంటనే సాగునీరు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ తలపెట్టిన రాగులపాడు పంప్‌హౌస్‌ ముట్టడి కార్యక్రమానికి రైతులు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.


    వెనుకబడిన ప్రాంతాలపై ఇంత నిర్లక్ష్యమా..?
    వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు.  ఒక పక్క నిధులు లేవంటూనే తాత్కాలిక సచివాలయంలో వాస్తు పేరుతో కోట్ల రుపాయలు ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. రెండు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలకు రూ. 750 కోట్లు ఇచ్చిందని, అయితే ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలు మాని గ్రామాల్లో తిరిగితే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement