ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌లో దారుణం జరిగింది. ఓల్గా లియోన్టీవా(32) అనే మహిళ ప్రమాదవశాత్తు లిఫ్ట్‌లో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయింది. లిఫ్ట్‌లో ఇరుక్కున్న మహిళ మూడు రోజుల పాటు సహాయం కోసం దిక్కులు పిక్కటిల్లేలా అరిచినా ఎక్కడి నుంచి సహాయం అందలేదు. దీంతో చివరికి ప్రాణాలు కోల్పోయింది. భవంతి 9వ ఫ్లోర్‌లో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
తొమ్మిది ఫ్లోర్ల భవంతి నుంచి ఓల్గా లియోన్టీవా కిందకు దిగడానికి బయలు దేరింది. లిఫ్ట్‌లోకి ఎక్కే ప్రయత్నంలో ఆమె దానిలో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. ఎంత అరిచినా ఎవరూ గుర్తించకపోవడంతో సహాయం అందలేదు. జులై 24న ఈ ఘటన జరగగా.. ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. గాలింపు చేపట్టిన పోలీసులు.. బాధితురాలు లిఫ్ట్‌లో ఇరుక్కుని చనిపోయినట్లు గుర్తించారు.
చైనాలో తయారు చేసిన లిఫ్ట్‌గా గుర్తించిన పోలీసులు.. అది పనిచేయకపోవడమే కారణంగా గుర్తించారు. ఎలాంటి కరెంట్ కట్‌లు లేవని తేల్చారు. ఇలాంటి ఘటనే ఇటలీలోనూ ఇటీవల జరిగింది. కరెంట్ కట్ అయిన కారణంగా లిఫ్ట్ పనిచేయలేదు. దీంతో అందులో ఉన్న ఓ వ్యక్తి మృతి చెందాడు.
ఇదీ చదవండి: నైగర్‌లో సైనిక తిరుగుబాటు.. ఫ్రాన్స్ దేశస్తులు తిరుగు టపా..
Comments
Please login to add a commentAdd a comment