గాంధీ ఆస్పత్రి ప్రధాన భవనంలో రోగుల కోసం వినియోగించే లిఫ్ట్ మంగళవారం మరో మారు మొరాయించింది.
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్) : గాంధీ ఆస్పత్రి ప్రధాన భవనంలో రోగుల కోసం వినియోగించే లిఫ్ట్ మంగళవారం మరో మారు మొరాయించింది. ఉన్నట్టుండి మధ్యలో లిఫ్ట్ ఆగిపోవడంతో లిఫ్ట్ లోపల ఉన్న రోగులు కంగారుపడ్డారు. అయితే సిబ్బంది వారిని సురక్షితంగా బయటకు తరలించారు.
ఆస్పత్రిలో మొత్తం 18 లిఫ్ట్‌లు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం ఇన్‌పేషెంట్ భవనంలోని నాలుగు లిఫ్ట్‌లు మాత్రమే పనిచేస్తున్నాయి. అవి కూడా తరుచూ మొరాయిస్తుండడంతో రోగులతోపాటు వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లిఫ్ట్ మరమ్మత్తులకు నిధులు కేటాయించామని, త్వరలోనే పనులు చేపడతామని ఆస్పత్రి సూపరింటెండెంట్ వేంకటేశ్వర్లు తెలిపారు.