హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. బాత్‌రూం డోర్ అనుకొని లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసిన ఓ రోగి తల్లి సెల్లార్ గుంతలో పడి తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ మృతిచెందింది. మెదక్ జిల్లాకు చెందిన పోచమ్మ పెద్ద కొడుకు గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ కావడంతో.. వారం రోజుల క్రితం చూడటానికి ఆస్పత్రికి వచ్చింది. గ్రౌండ్‌ఫ్లోర్‌లోని ఆర్థోవార్డులో చికిత్స పొందుతున్న కొడుకు వద్ద ఉన్న పోచమ్మ కాలకృత్యాలు తీర్చుకోవడానికి బాత్‌రూం డోర్ అనుకొని లిఫ్ట్ డోర్ తెరిచి అందులో పడిపోయింది.
గుర్తించిన తోటి రోగుల బంధువులు ఆమెను సెల్లార్ గుంతలోనుంచి బయటికి తీసి వైద్యులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన పోచమ్మ వారం రోజులుగా చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతిచెందింది. ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యం వల్లే ఆమె మృతిచెందిందని పోచమ్మ బంధువులు ఆరోపిస్తున్నారు.
గాంధీ ఆస్పత్రిలో దారుణం
Published Thu, Oct 13 2016 4:57 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
Advertisement