
అగ్నిప్రమాదంలో ఏడుగురు మృతి
పొవాయ్‌లోని 22-స్టోరేలో శనివారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా 18 మంది వరకు గాయపడ్డారు...
లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి ఊపిరాడక మృతి?
ముంబై: పొవాయ్‌లోని 22-స్టోరేలో శనివారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా 18 మంది వరకు గాయపడ్డారు. చాందివలిలోని లేక్ ల్యూసెమ్ బిల్డింగ్‌లోని 14 ఫ్లోర్‌లో సాయంత్రం 5.30 గంటలకు మంటలు చెలరేగాయి. చూస్తుండగానే రెండు ఫ్లోర్లు పైకి ఎగబాకాయి. ‘ఈ ప్రమాదంలో ఓ మహిళ సహా ఏడుగురు మృతిచెందారు. 18 మంది గాయపడ్డారు. సాయంత్రానికి పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ప్రమాదంలో గాయపడిన వారందరినీ హీరానందినీ ఆస్పత్రికి తరలించాం. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది’ అని అసిస్టెంట్ కమిషనర్ ప్రదీప్ సోనావనే తెలిపారు. గ్యాస్ లీక్ అవ్వడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని, లిఫ్ట్‌లో చిక్కుపోయి ఊపిరాడకే ఏడుగురు చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం.