
‘మసక్కలీ మసక్కలీ’ పాట వినే ఉంటారు. వినకపోతే యూట్యూబ్‌లో ఒకసారి వినేయండి. అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ ఉంటుంది ఆ పాటలో. అనిల్ కపూర్ గుర్తున్నాడుగా. ముప్పై ఏళ్ల నాటి ‘మిస్టర్ ఇండియా’ ఫేమ్. అలాంటి సూపర్ డూపర్, పవర్‌ఫుల్, డేరింగ్, డాషింగ్ డాడీకి ఇంత వణికింగ్ కూతురు పుట్టిందేం?! మేడమ్‌కి లిఫ్ట్ అంటే భయం.
‘పోకిరి’ సినిమాలో ఇలియానాకి లిఫ్ట్ అంటే ప్రేమ. ఎందుకంటే లవ్‌సీన్ అంతా అక్కడే స్టార్ట్ అయింది కాబట్టి. ఈవిడకి మహేశ్‌బాబులాంటి హీరోని ఇచ్చినా లిఫ్ట్‌లో మాత్రం షూటింగ్ వద్దని చెబుతోందట! ఓ పక్క వాళ్ల నాన్న మొత్తుకుంటూనే ఉన్నాడు. ‘‘ఇలాగైతే ఏం పైకొస్తావే! బాలీవుడ్‌లో మెట్లెక్కాలంటే తిరుమల మెట్ల కంటే టఫ్. నా మాట విని లిఫ్ట్ ఎక్కు. తొందరగా పైకి రా’’ అని ఎంత మొత్తుకున్నా లిఫ్ట్ ఎక్కే భయం దిగట్లేదట!
Comments
Please login to add a commentAdd a comment