
ప్రతీకాత్మక చిత్రం
చెన్నై ,టీ.నగర్: లిఫ్ట్ ఇచ్చేందుకు నిరాకరించిన యువకుడిని హత్య చేశారు. వివరాలు.. అరక్కోణం సమీపంలోని కీళ్ ఆవదం కాలనీకి చెందిన దక్షిణామూర్తి (32) చెన్నైలోని ప్రైవేటు సెల్‌ఫోన్ సంస్థలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన బంధువు నాగరాజ్‌తో బైక్‌పై ఆదివారం అన్వాదికాన్‌పేటైకు వెళ్లాడు. మదురా మాదిమంగళం బస్టాప్ వద్ద బైక్ నిలిపి దక్షిణామూర్తి పెరుగు కొనేందుకు దుకాణానికి వెళ్లాడు. నాగరాజ్ బైక్ సమీపంలో నిలుచుని ఉన్నాడు.
ఆ సమయంలో బస్టాప్‌లో నిలుచున్న ఇద్దరు యువకులు తమను బైక్‌లో అన్వాదికాన్‌పేటైలో వదిలిపెట్టాలని కోరారు. ఇందుకు నాగరాజ్ నిరాకరించాడు. ఈలోగా అక్కడికి వచ్చిన దక్షిణామూర్తితో ఇద్దరు యువకులు గొడవకు దిగారు. ఆగ్రహించిన ఇద్దరు యువకులు కత్తితో దక్షిణామూర్తిపై దాడి చేశారు. ఆ తర్వాత అటువైపుగా బైక్‌పై వచ్చిన ఉలియనల్లూరు ప్రాంతానికి చెందిన వెంకటేశన్‌పై దాడి చేసి అతని బైక్‌ను లాక్కుని ఇద్దరు యువకులు పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన దక్షిణామూర్తి మృతిచెందాడు. దీనికి నిరసనగా మృతుడి బంధువులు, స్నేహితులు కీళ్ ఆవదం కాలనీ ప్రాంతం నుంచి అన్వాదికాన్‌పేటైకు వెళ్లే రోడ్డుపై రాస్తారోకో చేశారు. వారిని పోలీసులు సముదాయించి అక్కడి నుంచి పంపివేశారు.
Comments
Please login to add a commentAdd a comment