
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఐదు మహరాష్ట్రలోనే...
మహా శివరాత్రి సందర్భంగా వేలాదిగా భక్తుల రాక
ప్రత్యేక క్యూలైన్లు, మండపాలను ఏర్పాటు చేస్తున్న ఆలయ కమిటీలు
మహాశివరాత్రి పర్వదినంకోసం ముంబైతోపాటు రాష్ట్రంలోని శివాలయాలన్నీ ముస్తాబ వుతున్నాయి. మహాశివరాత్రికి రాష్ట్రంలోని జ్యోతిర్లింగ క్షేత్రాలు, ఇతర ఆలయాలకు భక్తులు పోటెత్తుతారు. ఈ నేపథ్యంలో ఆలయ కమిటీలు ప్రత్యేక క్యూలైన్లు, మండపాలను ఏర్పాటు చేస్తున్నాయి. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో అయిదు మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఔండా నాగనాథ్, భీమాశంకర్, ఘృశ్నేశ్వర్, పర్లి వైద్యనాథ్, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాల గురించి కొన్ని విశేషాలు....

త్రయంబకేశ్వర్..
జ్యోతిర్లింగ క్షేత్రాలలో త్రయంబకేశ్వర్ క్షేత్రానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ క్షేత్రం నాసిక్ జిల్లాలో ఉన్న ఈ ఆలయాన్ని నల్లరాతితో అద్భుత శిల్ప నైపుణ్యంతో నిరి్మంచారు. ఇక్కడ జ్యోతిర్లింగం బ్రహ్మ, విష్ణు, మహేశ్వర..ఇలా ముగ్గురి ముఖా లున్న స్వర్ణకవచంతో త్రిముఖ లింగంగా వెలుగొందుతోంది. పాండవుల కాలం నుంచి శివలింగాన్ని ఈ విధంగా అలంకరిస్తున్నట్లు స్థానికుల కథనం. ఈ ఆలయంలో మహా శివరాత్రితోపాటు శ్రావణ మాసంలోనూ విశేష పూజలను నిర్వహిస్తారు.
పర్లీ వైద్యనాథ్..
బీడ్ జిల్లాలో ఉన్న పర్లీ వైధ్యనా««థ్ దేవాలయ నిర్మాణ కాలం ఇతమిద్ధంగా తెలియదు. అయితే క్రీ.శ.1706 లో రాణి అహల్యాదేవి హోల్కర్ దీన్ని పునఃనిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ క్షేత్రం చుట్టుపక్కలంతా కొండలు, చెట్లు, ఔషధ మొక్కలతో అలరారు తుంటుంది. ఈ కారణంగా పర్లీ జ్యోతిర్లింగ క్షేత్రానికి వైద్యనాథ్ అనే పేరు వచ్చిందని భక్తుల కథనం.
ఔండా నాగనాథ్ ..
ఈ క్షేత్రం రాష్ట్రంలోని హింగోళి జిల్లాలో ఉంది. ఔండా నాగనాథ్ క్షేత్రాన్ని గూర్చి ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది. సంత్ జ్ఞానేశ్వర్, విసోబా కేచర, వార్కరీలు (భక్తుల సముదాయం) నాగనాథ్ ఆలయంలో భజనలు చేస్తుండగా పూజకు అంతరాయం కలుగుతోందని దూరంగా వెళ్లండని పూజారి బయటకువచ్చి చెప్పాడు. దీంతో వారు గుడి వెనకకు వెళ్లి తమ భజనలను కొనసాగించారట. వారి భజనలకు ముగ్దుడైన శివుడు వెనకవైపుకు తిరిగి వారి భక్తిగానాన్ని ఆలకించాడట. ఇందువల్లే ఈ ఆలయంలో నందీశుడు మందిరం వెనుక భాగంలో దర్శనమిస్తున్నాడని భక్తులు విశ్వసిస్తారు.
భీమశంకర్..
పుణేకు 128 కిమీ దూరంలో భీమశంకర్ క్షేత్రం ఉంది. భీమా నదీ తీరంలో ఉన్నందువల్లే ఈ క్షేత్రానికి భీమశంకర్ అనే పేరువచ్చిందని స్థానికులు నమ్ముతారు. భీమశంకర్ దేవాలయాన్ని పదమూడో శతాబ్దంలో నిరి్మంచారని, దేవాలయానికి ముందు భాగంలో ఉన్న మండపాన్ని నానా పద్‌నివాస్ 18 శతాబ్దంలో నిర్మించారని చారిత్రిక ఆధారాలను బట్టి తెలుస్తోంది. భీమశంకర్ దేవాలయాన్ని నాగరా పద్ధతిలో నిర్మించారు.
ఘృష్ణేశ్వర్
ఔరంగాబాద్ సమీపంలో ఉన్న ఈ ఘృష్ణేశ్వర్ క్షేత్రాన్ని ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించినట్టు చారిత్రక ఆ«ధారాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్షేత్రాన్ని ఘృష్ణేశ్వర్ క్షేత్రమని కూడా పిలుస్తారు. కుసుమ అనే మహిళ తన కొడుకు ప్రాణాలను రక్షించమని వేడుకుంటూ శివలింగాన్ని చేతులో పట్టుకొని కోనేరులో మునిగి శంకరుడిని గూర్చి ఘోర తపస్సు చేసింది. దీంతో ఆది దేవుడు ప్రత్యక్షమై ఆమెకు పుత్ర భిక్ష పెట్టాడు. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి ఘృష్ణేశ్వర క్షేత్రంగా పేరు వచ్చిందదని పురాణ కథనం.
మహాశివరాత్రి- ద్వాదశ జ్యోతిర్లింగాలు
రామనాథస్వామి లింగం, రామేశ్వరం
శ్రీశైల క్షేత్రం (మల్లి కార్జున లింగం), శ్రీశైలం
భీమశంకర లింగం, భీమా శంకరం
ఘృష్ణేశ్వర జ్వోతిర్లింగం, ఎల్లోరా గుహలు
త్రయంబకేశ్వర లింగం, త్రయంబకేశ్వరాలయం (త్రయంబకేశ్వర్, నాసిక్)
సోమనాథ లింగం, సోమనాథ్
నాగేశ్వర లింగం, దారుకావనం (ద్వారక)
ఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు, ఓంకారక్షేత్రం
వైద్యనాథ్ జ్యోతిర్లింగం, డియోఘర్ (జార్ఖండ్)
కేదారేశ్వర లింగం, హిమాలయాలపై సముద్రమట్టానికి 11,760 అడుగుల ఎత్తులో ఉంది
విశ్వేశ్వర లింగం - వారణాశి
కేదారేశ్వర్: కేదార్‌నాథ్
Comments
Please login to add a commentAdd a comment