
మహాశివరాత్రి శైవభక్తులకు ఎంతో ఇష్టమైన పండుగ. అలాగే ఆ పరమశివుడికి కూడా మహాశివరాత్రి ఎంతో ప్రీతికరమైన పర్వదినం. ఫాల్గుణ మాసంలో చీకటి పక్షంలో పద్నాలుగో రోజున వస్తుంది,శివర్రాతి రోజు భక్తకోటి శివుడికి అభిషేకాలు చేస్తారు. రోజంతా పచ్చి గంగ కూడా ముట్టకుండా ఉపవాసం ఉంటారు. శివనామస్మరణతో రాత్రంతా జాగరణ చేస్తారు. మహాశివరాత్రి సాయంత్రం శివలింగాన్ని పూజిస్తారు. దీపాలు వెలిగించి, రాత్రంతా ఆలయంలో గడుపుతారు. భారతదేశంలోని అనేక దేవాలయాలలో, రాత్రిపూట శివుడు, పార్వతిని అద్భుతమైన ఊరేగింపుగా పల్లకీపై తీసుకువెళతారు.
మహాశివరాత్రి ధ్యానానికి కూడా మంచి సమయం. ఈ రోజు ఉపవాసం ఉండటం వల్ల జీర్ణక్రియ బాగుంటుందని శాస్త్రాలు, పురాణ పండితులు చెబుతున్న మాట. ఆయుర్వేద పరంగా కూడా ఉపవాసం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆధ్యాత్మికంగా మనిషిని నిశ్చలంగా ఉంచడానికి, మనసును శుద్ధి చేయడానికి ఉపయోపడుతుంది.
మహాశివరాత్రి రోజు మంత్ర జపం, ధ్యానం, జాగరణ చేయడం వల్ల ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతుంది. ఉపవాసం ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయపడుతుంది. శరీరంలో శక్తి పెరుగు తుంది. శివరాత్రి సమయంలో ఉపవాసం అంటే శివునికి దగ్గరగా ఉండటం అని అర్థం. పంచేద్రియాలను దేవుడిపై నిమగ్నం చేస్తూ ఈ ఉపవాసం చేయాలట.
అయితే మన శక్తి, ఆరోగ్యస్థాయిని బట్టి ఉపవాసం చేయాలి. అనారోగ్యంతో ఉన్నవాళ్లు కఠిన ఉపవాసం చేయాల్సిన అవసరం లేదని భక్తితో శివుణ్ణి తలచుకుని, విశ్వాసంతో పూజచేసుకొని, ఉంగలిగితనంత అంటే, ఒక పూట లేదా, ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా ఉపవాసం ఉండి "ఓం నమః శివాయ" అని జపాన్మి స్మరించుకుంటే, ఆత్మకు శాంతిని, శివుని ఆశీస్సులను అందిస్తుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా బీపీ, షుగర్, ఇతర తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉంటే ఉపవాసాన్ని శక్తిని బట్టి సాధ్యమైనంత తొందరగా ముగించేయాలి.
చదవండి: Shivaratri2025 పుణ్యప్రదం.. జ్యోతిర్లింగ దర్శనం
ఉపవాస రకాలు
నిర్జల ఉపవాసం.. 24 గంటల పాటు ఆహారం, నీరు కూడా తీసుకోకూడదు. ఆరోగ్యం సహకరిస్తేనే ఈ ఉపవాసం చేయాలి.
జల ఉపవాసం.. రోజంతా ఆహారం లేకుండా నీరు మాత్రమే తాగాలి.
ద్రవ ఉపవాసం.. ఈ ఉపవాసంలో టీ, కొబ్బరి నీరు, నిమ్మకాయ నీరు మాత్రమే తీసుకోవాలి.
పాలు, పండ్ల ఉపవాసం.. పాలు, పండ్లు, పెరుగు, మజ్జిగ, గింజలు మొదలైనవి తీసుకోవచ్చు.
సాత్వికాహార ఉపవాసం.. ఆరోగ్యం బాగా లేకపోతే సగ్గుబియ్యం, మఖానా, డ్రై ఫ్రూట్స్, సాబుదాన కిచిడి, గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు ఉడకబెట్టిన బంగాళాదుంపలు వంటి తేలికపాటి సాత్వికాహారాన్ని ఉప్పు లేకుండా తినాలి.
నీరసం రాకుండా ఉండాలంటే
ముందు మానసికంగా సిద్ధంగా ఉండాలి. చిత్తం ఆ పరమ శివుడిమీద పెడితే అస్సలు ఆకలే అనిపించదని భక్తులు చెబుతున్న మాట. భక్తితో, శివనామస్మరణతో రోజంతా గడపాలి. ఒకవేళ శారీరకంగా బాగా నీరసం అనిపిస్తే జాగ్రత్త పడాలి.
ఉపవాసం తర్వాత మొదట పండ్లు, నానబెట్టిన గింజలు లేదా గోరువెచ్చని నిమ్మకాయ నీరు వంటివి తీసుకోవాలి. ఉపవాసం ఉన్న వ్యక్తి పండ్లు మాత్రమే తినాలి. ఈ రోజున, అరటిపండ్లు, ఆపిల్స్, బొప్పాయి, కొబ్బరి, దానిమ్మ మొదలైన పండ్లను తీసుకోవచ్చు.ఆహారంలో ఫైబర్, ప్రొటీన్‌లు ఎక్కువగా ఉండి, క్యాలరీలు తక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటే మంచిది.
మాంసాహారం: శివరాత్రి పర్వదింన ఉపవాసం ఉండేవారు శాకాహారం మాత్రమే తినాలి.
Comments
Please login to add a commentAdd a comment