తాత్త్వికథ
పాండిచ్చేరి పట్టణానికి చెందిన ఉన్నత విద్యావంతుడైన ఓ యువకుడికి అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణం చేయాలనిపించింది. అనుకున్నదే తడవుగా అరుణాచలం బస్సు ఎక్కాడు. అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకుని రాజగోపురం వద్ద నిలబడి వినాయకుణ్ణి ప్రార్థించి నడక ప్రారంభించాడు. అష్టలింగాలను చూస్తూ గిరి ప్రదక్షిణ పూర్తి చేయాలని అతడి ఆలోచన.
నడుస్తూ నడుస్తూ రమణ మహర్షి ఆశ్రమం చేరాడు. అక్కడ గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చిన ఓ ఆధ్యాత్మిక వేత్త పరిచయం అయ్యాడు. ‘‘అలజడి లేని జీవితాన్ని గడ΄ాలంటే ఏమి చేయాలి?’’ అని ఆసక్తిగా ఆ ఆధ్యాత్మికవేత్తను అడిగాడు యువకుడు. ఆధ్యాత్మిక వేత్త చిరునవ్వు ముఖంతో ‘‘ఇద్దరూ ఆడగలిగి, ఇద్దరూ గెలవగలిగే ఆట ఆడాలి’’ అని బదులిచ్చాడు. అర్థం కాని ముఖం పెట్టాడు ఆ యువకుడు. ఆధ్యాత్మికవేత్త యువకుడి హావభావాలు పట్టించుకోకుండా వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ‘ఇద్దరు ఆడితే ఎవరో ఒకరు గెలుస్తారు కానీ, ఇద్దరూ ఎలా గెలుస్తారు?’ అని ఆలోచనలు మొదలయ్యాయి ఆ యువకుడిలో. సమాధానం తెలుసుకుందామని తను కూడా వేగం పెంచాడు.
వల్లలార్ ఆశ్రమం వద్ద మళ్ళీ ఆధ్యాత్మిక వేత్త కనిపించాడు. ఆశ్చర్యంగా ‘‘మీరు చెప్పింది ఎలా సాధ్యం?’’ అని ప్రశ్నించాడు. ‘‘ఆలోచించు. నీకే అర్థమవుతుంది. తమాషా ఏమిటంటే ఇద్దరే కాదు, ఆ ఆటని యాభై మంది ఆడినా... అందరూ గెలుస్తారు. అంతేకాదు... అది అందరూ ఆడగలిగిన ఆట కూడాను’’ అంటూ ఆధ్యాత్మిక వేత్త వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ మొదటికి వచ్చింది యువకుడి పరిస్థితి. ఎవరినైనా అడిగి తెలుసుకుందామని ముందూ వెనుకా చూశాడు. తెలిసిన ముఖాలేవీ కనిపించలేదు. చేసేదేం లేక ఆధ్యాత్మికవేత్తను వెదుక్కుంటూ వెళ్ళాడు.
ఎలాగైతేనేమి ఈశాన్య లింగం వద్ద కనిపించాడు. గెసపోసుకుంటూ చెమటలు కారుస్తూ వెళ్ళి‘‘మీరు సమాధానం చెప్పక΄ోతే నా తల బద్దలై ΄ోయేలా ఉంది’’అని దిగులుగా ముఖం పెట్టాడు. యువకుడి భుజం తడుతూ ఆ ఆధ్యాత్మికవేత్త ‘‘విచిత్రం ఏమిటంటే... వందమంది ఆ ఆట ఆడినా, వందమందీ గెలుస్తారు. అదేమిటంటే... ఎదుటివారిని ప్రేమించే ఆట. అక్కడ అందరూ విజేతలే. ఓటమి పాలయ్యేవారు ఎవ్వరూ ఉండరు’’ అని సమాధానమిచ్చి అక్కడినుంచి మెరుపు వేగంతో వెళ్ళి΄ోయాడు.
‘‘నిజమే. జీవితమనేది ఒక ఆటలాంటిది. ప్రేమ విత్తనాలు వెదజల్లే ఆట ఆడటం ప్రారంభిస్తే జీవితం పూల తోట అవుతుంది. దానికి వయస్సు, భాష, లింగం, ్ర΄ాంతం, కులం, మతం అనే హద్దులు ఉండవు ’’ అనుకుంటూ ఆ యువకుడు గిరి ప్రదక్షిణ పూర్తి చేశాడు.
– ఆర్.సి. కృష్ణస్వామి రాజు
Comments
Please login to add a commentAdd a comment