సామాన్యులు సైతం సులభంగా వినియోగించేలా చాట్‌జీపీటీ తరహాలో భారత్ సైతం చాట్ బాట్‌లను తయారు చేయాలని ఓలా అధినేత భవిష్ అగర్వాల్ పిలుపునిచ్చారు.
కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌లో జరిగిన ఇన్‌సైట్: ది డిఎన్‌ఎ ఆఫ్ సక్సెస్ 12వ ఎడిషన్‌లో అగర్వాల్ మాట్లాడారు. రోజువారీ వినియోగంలో ఏఐ పాత్రపై ఆయన నొక్కి చెప్పారు.
ఏఐ గురించి మాట్లాడుతూ..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో భారత్ ప్రపంచ దేశాలకు దిశా నిర్ధేశం చేసే స్థాయికి చేరుకుంటుందని అన్నారు. ‘ఏఐ రెవెల్యూషన్ వేగంగా జరుగుతోంది. ఇది మనుషుల ప్రొడక్టివిటీని పెంచుతుంది. సైన్స్ ,ఆవిష్కరణలను వేగవంతం చేస్తుంది.అంతేకాదు జ్ఞానం, సృజనాత్మకత సరిహద్దులను చెరిపేస్తుంది. సాంకేతిక, ఆర్థిక పురోగతితో పాటుగా రీసెర్చ్ ,మెటాఫిజికల్ అన్వేషణ వంటి వివిధ ఏఐ అంశాలలో భారత్ అగ్రగామిగా వృద్ది సాధిస్తుందని భవిష్ అగర్వాల్ అభిప్రాయ పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment