Hamsa Nandini At Isha Foundation Pics Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Guess The Actress: ఆశ్రమంలో కనిపించిన టాలీవుడ్ హాట్ బ్యూటీ!

Published Tue, Jun 27 2023 12:51 PM | Last Updated on Tue, Jun 27 2023 1:24 PM

Hamsa Nandini Isha Foundation Pics Viral - Sakshi

తెలుగులోకి ప‍్రతి ఏడాది కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. పాత వాళ్లు మెల్లమెల్లగా కనుమరుగైపోతుంటారు. అలా పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ కూడా దాదాపు 20 ఏళ్ల క్రితమే తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. హీరోయిన్ గా చేస్తే రాని గుర్తింపు ఐటమ్ సాంగ్స్ తో సంపాదించింది. అలా ఓ ఐదేళ్ల పాటు వరసపెట్టి ఈమెని అవకాశాలు వరించాయి. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది. ఇప్పుడేమో సడన్ గా ఓ ఆశ్రమంలో కనిపించి అందరికీ షాకిచ్చింది. ఇంతకీ ఎవరా బ్యూటీ? ఏం జరిగింది?

ఈమె ఆమెనే
పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు హంస నందిని. మహారాష్ట్రలోని పుణెలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. 2004లో 'ఒక్కటవుదాం' అనే తెలుగు సినిమాతో నటిగా మారింది. ఆ తర్వాత అనుమానాస్పదం, అధినేత, ప్రవరాఖ్యుడు, ఈగ తదితర చిత్రాల్లో నటించింది. ఎప్పుడైతే ప్రభాస్ 'మిర్చి'లో ఐటమ్ సాంగ్ చేసిందో ఈమె ఫేట్ మారిపోయింది. స్పెషల్ సాంగ్స్ ల‍్లో అవకాశాలు వరసపెట్టి వచ్చాయి. అలా దాదాపు ఐదేళ్ల పాటు డ్యాన్సులతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది.

(ఇదీ చదవండి: క్రేజీ అడ్వెంచరస్ వెబ్‌ సిరీస్.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్)

ఐటమ్ గర్ల్ గా!
'మిర్చి'లో స్పెషల్ సాంగ్ చేసిన తర్వాత హంస నందిని.. భాయ్, రామయ్య వస్తావయ్యా, అత్తారింటికి దారేది, లెజెండ్, లౌక్యం, బెంగాల్ టైగర్, సోగ్గాడే చిన్ని నాయనా, శ్రీరస్తు శుభమస్తు, జై లవకుశ చిత్రాల్లోని ప్రత్యేక గీతాలతో అలరించింది. 2018లో చివరగా గోపీచంద్ 'పంతం'లో కనిపించింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది. 

క‍్యాన్సర్ బారిన పడి!
అయితే హంస నందిని సినిమాల్లో కనిపించకపోవడంతో అందరూ ఆమె గురించి మర్చిపోయారు. సడన్ గా 2021 చివర్లో ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. తాను క్యాన్సర్ బారిన పడ్డాడని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. త్వరలో కోలుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. చెప్పినట్లుగానే మెల్లమెల్లగా ఆ ప్రాణాంతక వ్యాధి నుంచి బయటపడింది. ఈ మధ్యనే కోయంబత్తూరులోని ఇషా ఆశ్రమంలో కనిపించింది. ఆ ఫొటోలనే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈమెని నెటిజన్స్ తొలుత గుర్తుపట్టలేకపోయారు గానీ కాసేపటికి గుర్తుపట్టేశారు.  ఎంతలా మారిపోయిందోనని కామెంట్స్ చేస్తున్నారు.


(ఇదీ చదవండి: పరువు తీసుకుంటున్న బాలీవుడ్.. చివరకి ఆ పాట!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement