
హేమంత్, గణేష్ ,ప్రీతి సుందర్, జాహ్నవి శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం స్పీడ్ 220. విజయలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఫణి కొండమూరి సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హర్ష బెజగం దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ స్పెషల్ సాంగ్‌ని విడుదల చేశారు. ‘బెజవాడలో బాలాకుమారి, మిర్యాలగూడలో మీనా కుమారి..’ అంటూ సాగే ఈ మాస్ పాటకి సంతోష్ కుమార్ బి లిరిక్స్ అందించగా.. ప్రముఖ గాయని గీతామాధురి అద్భుతంగా ఆలపించింది.
యంగ్ టాలెంటెడ్ డాన్సర్ స్నేహ గుప్తా తనదైన స్టెప్పులతో అదరగొట్టింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా చిత్రాన్ని తెరకెకికస్తున్నామని దర్శకుడు హర్ష తెలిపారు. ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా తగ్గకుండా భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment