కథే ఈ సినిమాకు హైలైట్
- శ్రీకాంత్
‘‘పోలీసాఫీసర్ అయిన నేను స్కూల్ టీచర్‌గా వెళ్లి ఏం చేశాను? అలాగే... స్కూల్ టీచర్ అయిన కథానాయిక పోలీసాఫీసర్‌గా వెళ్లి ఏం చేసింది?’ అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందినే చిత్రమే ‘ఢీ అంటే ఢీ’ ’’ అని శ్రీకాంత్ అన్నారు. ఆయన కథానాయకునిగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో సి.ఎన్.రెడ్డి, జి.జ్యోతికలతో కలిసి నిర్మించిన ‘ఢీ అంటే ఢీ’ ఈ నెలాఖరున విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ -‘‘ఇందులోని అన్ని పాటలకూ ప్రేమ్క్ష్రిత్ నృత్యరీతుల్ని సమకూర్చారు.
నా స్టెప్స్ ఇందులో కొత్తగా ఉంటాయి. బ్రహ్మానందం పాత్ర ఇందులో హైలైట్. ఆయన పదేళ్ల కొడుకుగా కూడా బ్రహ్మానందమే చేశారు. వైరైటీగా ఉంటుందీ పాత్ర’’ అని తెలిపారు. ‘‘ఈ చిత్రాన్ని నేనే నిర్మించడానికి కారణం కథ. భూపతిరాజా అద్భుతమైన కథ ఇచ్చారు. చంద్రబోస్ రాసిన ఐటమ్ సాంగ్ చాలా బావుంటుంది. ఆయన రాశాక, ఈ పాటను ట్యూన్ చేశాం. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసి ఈ నెలాఖరుకు సినిమాను విడుదల చేస్తాం’’ అని జొన్నలగడ్డ శ్రీనివాసరావు తెలిపారు.