
Pushpa Movie Item Song: పుష్ప సినిమా నుంచి రిలీజైన 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా..' పాట నిన్నటి నుంచి తెగ ట్రెండ్ అవుతోంది. పాట ఇలా రిలీజైందో లేదో నెటిజన్లు ఈ పాటను తెగ వాడేస్తూ రకరకాల ఎడిటింగ్‌లు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సాంగ్‌ను ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందానికి అన్వయిస్తూ ఎడిట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీన్ని రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ రీట్వీట్ చేశాడు. హిలేరియస్, సూపర్‌గా ఎడిట్ చేశారంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. అంతేకాదు బ్రహ్మానందాన్ని కాపీ కొడుతోందంటూ కొన్ని మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి.
😂🤣😂🤣😂. This is Hilarious !!! Superrr Edit !! 😀😀😀👌🏻👌🏻👌🏻 https://t.co/Ii9AVEEamC
— DEVI SRI PRASAD (@ThisIsDSP) December 11, 2021
బ్రహ్మీనే కాదు ప్రభాస్‌ను కూడా వాడేస్తూ ఎడిటింగ్ చేసిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్- సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం పుష్ప. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఊ అంటావా మావా అనే ఐటం సాంగ్‌లో సమంత సందడి చేయనుంది. ఇక ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది.
Thq Anna Big Fan Check This Out Too 😍https://t.co/Box3YkmMEy
— DHK ™ (@Devineni_Hari) December 11, 2021
Comments
Please login to add a commentAdd a comment