Bjp Mla Raja Singh: Warning To Devi Sri Prasad Over His Comments - Sakshi
Sakshi News home page

Raja Singh: డీఎస్పీకి వార్నింగ్‌ ఇచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్‌

Published Sat, Dec 18 2021 1:36 PM | Last Updated on Sat, Dec 18 2021 6:40 PM

Bjp Mla Raja Singh Warning To Devi Sri Prasad Over His Comments - Sakshi

Raja Singh Warning To Music Director Devi Sri Prasad Over His Comments: 'పుష్ప' సినిమా ఐటెం సాంగ్‌పై వివాదం ఇంకా ముదరుతూనే ఉంది. ఇటీవలె ఈ సాంగ్‌పై వస్తున్న విమర్శలపై దేవీశ్రీ ప్రసాద్‌ చేసిన కామెంట్స్‌ వివాదాస్పదంగా మారాయి. పుష్ప ప్రమోషన్స్‌లో భాగంగా ఐటెం సాంగ్స్‌ను భక్తి గీతాలతో పోలుస్తూ దేవీశ్రీ ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పందించారు.

దేవీశ్రీ ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన ఆరోపించారు. వెంటనే దేవీశ్రీ ప్రసాద్‌ హిందువులకు క్షమాపణలు చెప్పాలని, లేకపోతే ఆయన్ను బయట తిరగనివ్వమని వార్నింగ్‌ ఇచ్చారు. ఐటెం సాంగ్‌లోని కొన్ని లిరిక్స్‌ని దేవుడి శ్లోకాలతో పోల్చాడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజాసింగ్‌ చేసిన ఈ కామెంట్స్‌ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

కాగా పుష్ప ప్రమోషన్స్‌లో పాల్గొన్న డీఎస్పీ.. తన దృష్టిలో భక్తి గీతాలు, ఐటెం సాంగ్స్ ఒక్కటేనని మాట్లాడిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా  'రింగ రింగా', 'ఊ అంటావా మావా' పాటలను సైతం భక్తి గీతాలుగా మార్చి పాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement