Pushpa Movie: Allu Arjun Reacts on Samantha Item Song Controversy - Sakshi
Sakshi News home page

Allu Arjun: ఐటెం సాంగ్‌ లిరిక్స్‌పై తొలిసారిగా స్పందించిన బన్నీ

Published Fri, Dec 17 2021 10:57 AM | Last Updated on Mon, Dec 20 2021 11:33 AM

Pushpa Movie: Allu Arjun Reacts on Samantha Item Song Controversy - Sakshi

'పుష్ప' సినిమాలో సమంత స్పెషల్‌సాంగ్‌ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అదే స్థాయిలో వివాదాలు చుట్టుముడుతున్నాయి. సమంత తొలిసారిగా చేసిన ఐటెం సాంగ్‌‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. పాట లిరిక్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ పాటను బ్యాన్‌ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్‌ పురుషుల సంఘం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇటీవలె తమిళనాడులోని పురుషుల సంఘం సైతం ఏపీలోని చిత్తూరు కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

తాజాగా పుష్ప ప్రమోషన్లలో పాల్గొన్న అల్లు అర్జున్‌ ఈ కాంట్రవర్సరీపై స్పందించారు. ‘మీ మగబుద్ధే వంకరబుద్ధి..'  అంటూ పాట లిరిక్స్‌పై వస్తున్న వివాదాలపై మీ స్పందన ఏంటి అని ఓ రిపోర్టర్‌ బన్నీని ప్రశ్నించగా... 'లిరిక్స్‌లో తప్పు లేదు, ఇదే నిజం' అంటూ షాకింగ్‌ కౌంటర్‌ ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement