
Ariyana Dancing For Samantha Oo Antava Oo Oo Antava Song In Pushpa: 'పుష్ప' మ్యానియా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తే, సమంత స్పెషల్ సాంగ్‌తో ఆ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. ఈ సినిమాలోని ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. పాట ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది.
సౌత్ ఇండియన్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ వ్యూస్ రాబట్టిన పాటగా దుమ్మురేపుతుంది. ముఖ్యంగా సమంత స్టన్నింగ్ లుక్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తాజాగా బిగ్‌బాస్‌తో బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్న బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరీ సైతం ఈ పాటకు తనదైన స్టైల్‌లో చిందులేసింది. రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కాగా అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్17న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment