'Suryapet Junction' Completes Post-Production Work - Sakshi
Sakshi News home page

Suryapet Junction:మ్యాచింగ్‌ మ్యాచింగ్‌ ఐటం సాంగ్‌ రీల్స్‌.. లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశం

Published Wed, Apr 5 2023 2:40 PM | Last Updated on Wed, Apr 5 2023 3:13 PM

Suryapet Junction Complete Post Production Work - Sakshi

ఈశ్వర్, నయన సర్వర్ జంటగా నటించిన చిత్రం "సూర్యాపేట్ జంక్షన్ ". అభిమన్య సింగ్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా పూజ ఐటమ్‌ సాంగ్‌లో కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, టీజర్, మ్యాచింగ్ మ్యాచింగ్ లిరికల్ సాంగ్ విడుదలవగా మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో కాలేజ్ సాంగ్‌ను, ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకున్న "సూర్యా పెట్ జంక్షన్" మూవీనీ ఈ నెలాఖరులో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

చిత్రయూనిట్‌ మరిన్ని విశేషాలు వెల్లడిస్తూ.. 'ప్రమోషన్‌లో బాగంగా మ్యాచింగ్ మ్యాచింగ్ ఐటమ్ సాంగ్‌కు సోషల్ మీడియాలో ప్రకటించిన రీల్స్ పోటీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ కాంటెస్ట్ విజేతలను త్వరలోనే ప్రకటించి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఒకరికి లక్ష రూపాయలు, మిగతా పది మందికి 10 వేల రూపాయల చొప్పున, అలాగే మరో పది మందికి 5 వేల రూపాయల చొప్పున అందివ్వనున్నాం. ఏప్రిల్ 25 వరకు ఈ పోటీలో పాల్గొనవచ్చు' అని ఈ చిత్ర యూనిట్ తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement