పుష్ప-2లో ఐటమ్‌ సాంగ్‌.. ఆ హీరోయిన్‌ను రిజెక్ట్‌ చేసిన నిర్మాతలు! | Shraddha Kapoor Rejected a special song with Allu Arjun in Pushpa 2 | Sakshi
Sakshi News home page

Pushpa 2 The Rule: పుష్ప-2లో ఐటమ్‌ సాంగ్‌.. భారీగా డిమాండ్‌ చేసిన హీరోయిన్!

Published Mon, Nov 4 2024 4:49 PM | Last Updated on Mon, Nov 4 2024 4:53 PM

Shraddha Kapoor Rejected a special song with Allu Arjun in Pushpa 2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. సుకుమార్‌ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా ఈ  సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

అయితే పుష్ప మూవీలో సమంత ఐటమ్‌ సాంగ్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ.. అంటూ కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. ఆ సాంగ్‌కు ఫుల్ క్రేజ్ రావడంతో పార్ట్‌-2లోనూ ఐటమ్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్‌తో చిత్రయూనిట్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

అయితే పుష్ప-2 చిత్రంలో ఐటమ్ సాంగ్‌ కోసం శ్రద్దాకపూర్ భారీగా రెమ్యునరేషన్‌ డిమాండ్ తెలుస్తోంది. ఒక్క పాటకు దాదాపు రూ.5 కోట్ల పారితోషికం అడిగినట్లు సమాచారం. అయితే అంత భారీస్థాయిలో డిమాండ్ చేయడంతో పుష్ప-2 నిర్మాతలు తిరస్కరించినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఐటమ్ సాంగ్‌లో శ్రద్ధా కపూర్‌ డ్యాన్స్‌ చూడాలనుకున్నా ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. అయితే గతంలో సమంతకు కూడా దాదాపు రూ.5 కోట్ల రెమ్యునరేషన్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే పుష్ప-2 ఐటమ్‌ సాంగ్‌లో గుంటూరు కారం భామ శ్రీలీల కనిపించనున్నట్లు లేటేస్ట్ టాక్‌. ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో మెప్పించిన భామ ప్రస్తుతం టాలీవుడ్‌ సినిమాలతో బీజీగా ఉంది. శ్రీలీలతో డీల్‌ ఓకే అయితే పుష్ప-2 తన డ్యాన్స్‌తో అభిమానులను ‍అలరించనుంది. కాగా పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా మరోసారి శ్రీవల్లిగా ప్రేక్షకులను అలరించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement