
దేశీ లుక్‌లో హాట్‌గా..!
ఏంటమ్మాయ్.. రోజు రోజుకీ బొద్దుగా తయారవుతున్నావ్? అని గతంలో ఎవరైనా పరిణీతీ చోప్రాను ప్రశ్నిస్తే..
ఏంటమ్మాయ్.. రోజు రోజుకీ బొద్దుగా తయారవుతున్నావ్? అని గతంలో ఎవరైనా పరిణీతీ చోప్రాను ప్రశ్నిస్తే.. ‘ఏం అమ్మాయిలు బొద్దుగా ఉంటే చూడరా? నా శరీరం, నా ఇష్టం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసేవారు. అవకాశాలు ఆవిరయ్యేసరికి చక్కనమ్మ సన్నబడక తప్పలేదు. బొండుమల్లి సన్నజాజిలా మారితే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో.. పరిణీతికి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.
చిక్కినాక ఆఫర్లు పెరిగాయట. ప్రస్తుతం ‘మేరీ ప్యారీ బిందు’లో నటిస్తున్నారామె. ఇది కాకుండా ఓ ఐటమ్ సాంగులోనూ కనిపించనున్నారు. జాన్ అబ్రహాం, వరుణ్ ధావన్ హీరోలుగా నటిస్తున్న ‘డిషూమ్’లో పరిణీతి ఐటమ్ సాంగ్ చేస్తున్నారు. ముంబైలోని మెహబూబా స్టూడియోలో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోంది.
ఈ ప్రత్యేక పాటలో పరిణీతి దేశీ లుక్ హాట్‌గా ఉంటుందని సమాచారం. పరిణీతి కాస్టూమ్స్‌ను ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్ర డిజైన్ చేశారు. ఈ బ్యూటీ చేస్తున్న తొలి ఐటమ్ సాంగ్ ఇదే కావడం విశేషం. ఈ సాంగ్ చూడాలంటే వచ్చే నెలాఖరు వరకూ ఆగాల్సిందే. రోహిత్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూలై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.