Dishoom
-
బాలీవుడ్లోనే ఖరీదైన ఫైట్ సీన్
బాలీవుడ్ హీరోలు జాన్ అబ్రహం, వరుణ్ ధవన్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా డిష్యుం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ ప్రముఖులను ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్లో హెలికాప్టర్‌తో ఓ యాక్షన్ సీన్‌ను చూపించారు. ఈ ఒక్క సీన్ షూట్ చేయడానికి ఏకంగా మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. అంతేకాదు ఈ యాక్షన్ సీన్ దాదాపు 12 నిమిషాల నిడివితో ఊపిరి బిగబట్టి చూసేంత ఆసక్తికరంగా తెరకెక్కించినట్టు చెపుతున్నారు చిత్రయూనిట్. మొరాకోలో షూట్ చేసిన ఈ సీన్స్‌లో హెలికాప్టర్లతో పాటు అంతర్జాతీయ స్థాయి ప్రొఫెషనల్ ఫైటర్స్ కూడా పాల్గొన్నట్టు తెలిపారు. టీమిండియాలో టాప్ బ్యాట్స్‌మన్ విరాజ్ కిడ్నాప్ నేపథ్యంలో సాగే ఈ కథలో వరుణ్ ధవన్, జాన్ అబ్రహం ఇన్వస్టిగేషన్ ఆఫీసర్లుగా కనిపించనున్నారు. రోహిత్ ధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాక్వలిన్ ఫెర్నాండెజ్, అక్షయ్ ఖన్నా ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. -
దేశీ లుక్‌లో హాట్‌గా..!
ఏంటమ్మాయ్.. రోజు రోజుకీ బొద్దుగా తయారవుతున్నావ్? అని గతంలో ఎవరైనా పరిణీతీ చోప్రాను ప్రశ్నిస్తే.. ‘ఏం అమ్మాయిలు బొద్దుగా ఉంటే చూడరా? నా శరీరం, నా ఇష్టం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసేవారు. అవకాశాలు ఆవిరయ్యేసరికి చక్కనమ్మ సన్నబడక తప్పలేదు. బొండుమల్లి సన్నజాజిలా మారితే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో.. పరిణీతికి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. చిక్కినాక ఆఫర్లు పెరిగాయట. ప్రస్తుతం ‘మేరీ ప్యారీ బిందు’లో నటిస్తున్నారామె. ఇది కాకుండా ఓ ఐటమ్ సాంగులోనూ కనిపించనున్నారు. జాన్ అబ్రహాం, వరుణ్ ధావన్ హీరోలుగా నటిస్తున్న ‘డిషూమ్’లో పరిణీతి ఐటమ్ సాంగ్ చేస్తున్నారు. ముంబైలోని మెహబూబా స్టూడియోలో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఈ ప్రత్యేక పాటలో పరిణీతి దేశీ లుక్ హాట్‌గా ఉంటుందని సమాచారం. పరిణీతి కాస్టూమ్స్‌ను ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్ర డిజైన్ చేశారు. ఈ బ్యూటీ చేస్తున్న తొలి ఐటమ్ సాంగ్ ఇదే కావడం విశేషం. ఈ సాంగ్ చూడాలంటే వచ్చే నెలాఖరు వరకూ ఆగాల్సిందే. రోహిత్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూలై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
గే పాత్రలో ప్రముఖ హీరో
ముంబై: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఫవాద్ ఖాన్ బాటలోనడవనున్నాడు. రోహిత్ ధవన్ దర్శకత్వం వహిస్తున్న 'డిష్యుం' సినిమాలో ఆయన గే పాత్రలో కనిపించనున్నాడు. అబుదాబీలో జరుగుతున్న షూటింగ్ లో వరుణ్ దవన్, జాన్ అబ్రహం తో కలిసి నటించనున్నాడని సమాచారం. గే పాత్రలో స్కట్ ను ధరించి అక్షయ్ కనిపిస్తాడు. మార్షల్ ఆర్ట్ ఫైట్స్ తో ఇన్నాళ్లూ తన కంటూ ఒక మాస్ ఇమేజ్ ను సంపాదించుకున్న ఈ మాస్ హీరో గే పాత్రలో ఎంత వరకు మెప్పిస్తాడో చూడాల్సిందే. జాన్ అబ్రహం,వరుణ్ ధవన్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'డిష్యుం' ఈ సినిమా జులై 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది.