బాలీవుడ్లోనే ఖరీదైన ఫైట్ సీన్ | varun and johns dishoom action scene is bollywoods costliest | Sakshi
Sakshi News home page

బాలీవుడ్లోనే ఖరీదైన ఫైట్ సీన్

Published Fri, Jul 1 2016 2:37 PM | Last Updated on Mon, Sep 4 2017 3:54 AM

బాలీవుడ్లోనే ఖరీదైన ఫైట్ సీన్

బాలీవుడ్లోనే ఖరీదైన ఫైట్ సీన్

బాలీవుడ్ హీరోలు జాన్ అబ్రహం, వరుణ్ ధవన్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా డిష్యుం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ ప్రముఖులను ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్లో హెలికాప్టర్తో ఓ యాక్షన్ సీన్ను చూపించారు.

ఈ ఒక్క సీన్ షూట్ చేయడానికి ఏకంగా మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. అంతేకాదు ఈ యాక్షన్ సీన్ దాదాపు 12 నిమిషాల నిడివితో ఊపిరి బిగబట్టి చూసేంత ఆసక్తికరంగా తెరకెక్కించినట్టు చెపుతున్నారు చిత్రయూనిట్. మొరాకోలో షూట్ చేసిన ఈ సీన్స్లో హెలికాప్టర్లతో పాటు అంతర్జాతీయ స్థాయి ప్రొఫెషనల్ ఫైటర్స్ కూడా పాల్గొన్నట్టు తెలిపారు.

టీమిండియాలో టాప్ బ్యాట్స్మన్ విరాజ్ కిడ్నాప్ నేపథ్యంలో సాగే ఈ కథలో వరుణ్ ధవన్, జాన్ అబ్రహం ఇన్వస్టిగేషన్ ఆఫీసర్లుగా కనిపించనున్నారు. రోహిత్ ధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాక్వలిన్ ఫెర్నాండెజ్, అక్షయ్ ఖన్నా ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement