
అక్షయ్‌కుమార్ హోమో? ఏమో!
అక్షయ్‌కుమార్‌కు సంబంధించి ఇప్పుడీ సంచలనాత్మక వార్త ప్రచారంలో ఉంది.
అక్షయ్‌కుమార్‌కు సంబంధించి ఇప్పుడీ సంచలనాత్మక వార్త ప్రచారంలో ఉంది. ఈ బాక్సాఫీస్ హీరో హోమోసెక్సువల్ పాత్రలో కనిపించనున్నారట. రోహిత్ ధావన్ దర్శకత్వంలో రోహిత్ సోదరుడు వరుణ్ ధావన్, జాన్ అబ్రహమ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లు నటిస్తున్న ‘డిషూమ్’లో ఈ వింత గెటప్ ఆయన వేస్తున్నట్లు భోగట్టా.
తొలి చిత్రం ‘దేసీ బాయిజ్’లో అక్షయ్ కుమార్ నటించడం కలిసొచ్చిందని రోహిత్ ధావన్ అభిప్రాయం. అందుకని, ఈ రెండో సినిమాలోనూ నటించాల్సిందిగా అక్షయ్‌ను కోరారట. స్క్రిప్ట్‌లో ఆయనకు తగ్గ పాత్ర ఏదీ లేకపోవడంతో, హోమోసెక్సువల్‌గా ప్రత్యేక పాత్ర సృష్టించారట.
అక్షయ్ ఈ పాత్ర విని తమాషాగా ఉందన్నారనీ, నటించడానికి ఒప్పుకున్నారనీ ముంబయ్ సినీ జనాల కబురు. ఈ వార్తలో నిజానిజాల మాటేమో కానీ, నిజజీవితానికి దగ్గరగా ఉండే పాత్రలను తెరకెక్కించడం ఇటీవల పెరిగిన హిందీ సినిమాల్లో అక్షయ్ లాంటి పెద్ద హీరో అలాంటి పాత్ర చేస్తే విశేషమే కదూ!