
'ఆ సినిమాతో పోలికే లేదు'
ముంబై: 'డిష్యూమ్' సినిమాతో 'ధూమ్'కు పోలిక ఉండదని హీరోలు జాన్ అబ్రహం, వరుణ్ ధావన్ తెలిపారు. ఈ రెండు సినిమాలకు ఎటువంటి పోలికలు లేవని స్పష్టం చేశారు. తమ సినిమా విభిన్నంగా ఉంటుందని చెప్పారు. 'డిష్యూమ్' సినిమా ట్రైలర్ ను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందని తెలిపారు. ఇందులో కబీర్, జునైద్ గా నటించామని... వీరిద్దరూ ఎదుర్కొనే సమస్యలు, వాటిలోంచి బయటడేందుకు చేసే విన్యాసాలు ఆకట్టుకుంటాయన్నారు.
'ధూమ్' సినిమాలోనూ కబీర్ గా జాన్ అబ్రహం నటించాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుసగా సీక్వెల్స్ తీస్తున్నారు. అయితే రెండు సినిమాల్లో తన పాత్ర పేరు ఒకటే అయినా రెండు డిఫరెంట్ రోల్స్ అని చెప్పాడు. వరుణ్ సోదరుడు రోహిత్ దర్శకత్వం వహించిన 'డిష్యూమ్'లో జాక్వెలెస్ ఫెర్నాడెంజ్, అక్షయ్ ఖన్నా ప్రధానపాత్రల్లో నటించారు. జూలై 29న ఈ సినిమా విడుదల కానుంది.