పోయే ఏనుగు పోయే: ఈడొచ్చి పైటేసిన చిన్నదాన్ని సాంగ్‌ రిలీజ్‌.. | Bahubali Prabhakar Enugu Poye Item Song Released | Sakshi
Sakshi News home page

Poye Enugu Poye: బలివ్వడానికి రెడీ చేసిన ఏనుగు పిల్లను కుర్రాడెలా ఆపాడు?

Published Sun, May 28 2023 6:54 PM | Last Updated on Sun, May 28 2023 6:54 PM

Bahubali Prabhakar Enugu Poye Item Song Released - Sakshi

తమిళ నటుడు మనోబాల కీలక పాత్రల్లో నటించారు. అలాగే అద్భుతమైన గ్రాఫిక్స్‌తో విజువల్ వండర్‌గా సినిమాను తీర్చిదిద్దాము. అతి త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం అ

బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన చిత్రం 'పోయే ఏనుగు పోయే'. కె.శ‌ర‌వ‌ణ‌న్ స్వీయ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. ధ‌మాకా, బ‌లగం చిత్రాల‌తో  మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న  భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని స‌మ‌కూర్చారు. ఈ చిత్రంలోని 'ఈడొచ్చి పైటేసిన చిన్న‌దాన్ని' అనే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను సిల్లీ మాంక్స్ ఆడియో ద్వారా ఆదివారం విడుద‌ల చేశారు. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కుతోన్న ఈ పాన్ ఇండియా చిత్రం ప్ర‌స్తుతం సెన్సార్ ప‌నుల్లో బిజీగా ఉంది. త్వ‌ర‌లో విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క నిర్మాత కె.శ‌ర‌వ‌ణ‌న్ మాట్లాడుతూ... 'భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించిన మా చిత్రంలోని ఐటెమ్ లిరిక‌ల్ వీడియో ఈ రోజు లాంచ్ చేశాము. శ్రీ సిరాగ్ ఈ పాట‌ను ర‌చించారు. మా సినిమా కథ విషయానికొస్తే... నిధిని దక్కించుకోవడానికి కొంత మంది ఒక ఏనుగు పిల్లని బలి ఇవ్వాలనుకుంటారు... దాన్ని ఒక కుర్రాడు ఎలా ఆపాడు? తన తల్లి దగ్గరకు ఎలా చేర్చాడు అన్నది కథాంశం. ఇందులో బాహుబలి ప్రభాకర్, ధన్ రాజ్, రఘు బాబు, తమిళ నటుడు మనోబాల కీలక పాత్రల్లో నటించారు. అలాగే అద్భుతమైన గ్రాఫిక్స్‌తో విజువల్ వండర్‌గా సినిమాను తీర్చిదిద్దాము. అతి త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం అన్ని భాషల్లో విడుదలై ఆదరణ పొందుతుందన్న నమ్మకం ఉంది' అని తెలిపారు.

చదవండి: 30 ఏళ్లుగా హీరోలతో దెబ్బలు తిన్నా..: సింహాద్రి నటుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement