Bheems Ceciroleo
-
సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తోన్న 'పర్ఫ్యూమ్'.. టైటిల్ సాంగ్ రిలీజ్!
చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘పర్ఫ్యూమ్’. జే.డి.స్వామి దర్శకత్వంలో తెరకకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ బ్యానర్స్‌పై జె.సుధాకర్, శివ.బి, రాజీవ్ కుమార్.బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను బిగ్‌బాస్ కంటెస్టెంట్ భోలె షావలి, భీమ్స్ సిసిరోలియో చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ పర్ఫ్యూమ్ టైటిల్ సాంగ్‌ను భీమ్స్ సిసిరొలియో కంపోజ్ చేయగా.. సురేష్ గంగుల సాహిత్యాన్ని రచించారు. ఈ పాటను వరం, కీర్తన శర్మ ఆలపించారు. సినిమాలోని హీరో కారెక్టర్ మీద ఈ పాటను కంపోజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇంతవరకు ఎప్పుడు రాని స్మెల్ బేస్డ్ క్రైమ్ థ్రిల్లర్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కాగా.. ఈ చిత్రం నవంబర్ 24న థియేటర్లోకి రాబోతోంది. ఈ చిత్రానికి అజయ్ సంగీతం అందిస్తున్నారు. -
పోయే ఏనుగు పోయే: ఈడొచ్చి పైటేసిన చిన్నదాన్ని సాంగ్ రిలీజ్..
బాహుబలి ప్రభాకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'పోయే ఏనుగు పోయే'. కె.శరవణన్ స్వీయ దర్శకత్వం వహిస్తున్నాడు. ధమాకా, బలగం చిత్రాలతో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరక్టర్‌గా పేరు తెచ్చుకున్న భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రంలోని 'ఈడొచ్చి పైటేసిన చిన్నదాన్ని' అనే లిరికల్ వీడియో సాంగ్‌ను సిల్లీ మాంక్స్ ఆడియో ద్వారా ఆదివారం విడుదల చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియా చిత్రం ప్రస్తుతం సెన్సార్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత కె.శరవణన్ మాట్లాడుతూ... 'భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించిన మా చిత్రంలోని ఐటెమ్ లిరికల్ వీడియో ఈ రోజు లాంచ్ చేశాము. శ్రీ సిరాగ్ ఈ పాటను రచించారు. మా సినిమా కథ విషయానికొస్తే... నిధిని దక్కించుకోవడానికి కొంత మంది ఒక ఏనుగు పిల్లని బలి ఇవ్వాలనుకుంటారు... దాన్ని ఒక కుర్రాడు ఎలా ఆపాడు? తన తల్లి దగ్గరకు ఎలా చేర్చాడు అన్నది కథాంశం. ఇందులో బాహుబలి ప్రభాకర్, ధన్ రాజ్, రఘు బాబు, తమిళ నటుడు మనోబాల కీలక పాత్రల్లో నటించారు. అలాగే అద్భుతమైన గ్రాఫిక్స్‌తో విజువల్ వండర్‌గా సినిమాను తీర్చిదిద్దాము. అతి త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం అన్ని భాషల్లో విడుదలై ఆదరణ పొందుతుందన్న నమ్మకం ఉంది' అని తెలిపారు. చదవండి: 30 ఏళ్లుగా హీరోలతో దెబ్బలు తిన్నా..: సింహాద్రి నటుడు -
‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి..నాకేందిర ఈ లొల్లి’.. భీమ్స్ సాంగ్ అదిరింది
ఈ మధ్య కాలంలో తెలంగాణ జానపద గీతాలకు చిత్ర పరిశ్రమలో మంచి స్పందల లభిస్తోంది. స్టార్ హీరోల సినిమాల్లో సైతం ఫోక్ సాంగ్స్ ఉంటున్నాయి. అలాగే ప్రైవేట్ ఆల్బమ్స్గాను ఈ పాటలు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. నివృతి వైబ్స్ సంస్థ అత్యుత్తమమైన ప్రొడక్షన్ వేల్యూస్‌తో ఆడియో, విజువల్ కంటెంట్‌తో ఫోక్ సాంగ్స్‌ని చిత్రీకరించి యూట్యూబ్‌లో రిలీజ్ చేసి హిట్ కొట్టేస్తున్నాయి. ఇప్పటికే ఈ సంస్థ విడుదల చేసిన జరీ జరీ పంచెకట్టి.., గుంగులు, సిలక ముక్కుదానా, జంజీరే, వద్దన్నా గుండెల్లో సేరి వంటి పాటలకు ఆడియన్స్‌ని నుంచి మంచి స్పందల లభించిన చింది. (చదవండి: బంగారం' సినిమాలో చిన్నారి.. ఇంతలా మారిపోయిందేంటీ? ) తాజాగా ఈ సంస్థ మరో తెలంగాణ జానపద గీతాన్ని మ్యూజిక్ వీడియోగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి..నాకేందిర ఈ లొల్లి’ అంటూ సాగే ఈ పాటలో జయతి ప్రధాన భూమికను పోషించింది. (చదవండి: వెదవలకు అటెన్షన్ ఇస్తే ఇంకా రెచ్చిపోతారు : నిహారిక ) బుల్లి తెరపై వెన్నెల ప్రోగ్రామ్‌తో తిరుగులేని క్రేజ్, ఇమేజ్ను దక్కించుకున్న జయతి ఈ సాంగ్‌లో అద్భుతమైన హావ భావాలతో, మూమెంట్స్‌లో కట్టి పడేసింది. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఈ పాటకు సాంగ్ కు సంగీత సారథ్యాన్ని వహించారు. కాస్లర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను శ్రావణ భార్గవి అద్భుతంగా ఆలపించారు. -
వందేళ్లైనా రవితేజను మర్చిపోను: భీమ్స్ సిసిరోలియో
‘‘రవితేజగారితో ‘బెంగాల్ టైగర్’ చిత్రం చేశా. ఆయన ‘ధమాకా’ చిత్రానికి రెండోసారి అవకాశం ఇవ్వడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. ‘బెంగాల్ టైగర్’కి మించిన పాటలు ‘ధమాకా’లో ఉన్నాయి. రవితేజగారు నాకు గొప్ప నమ్మకాన్ని ఇచ్చారు.. వందేళ్ల తర్వాత కూడా దీన్ని మర్చిపోను’’ అని సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అన్నారు. రవితేజ, శ్రీలీల జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ధమాకా’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ–అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఈ నెల 23న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ– ‘‘రవితేజగారిని చూస్తే చాలు పాటలు, ప్రేమ, భక్తి పుడతాయి. భీమ్స్ పనైపోయిందనే కామెంట్లు విన్నప్పుడు అవకాశం ఇచ్చారు రవితేజగారు. ‘ధమాకా’కి రవితేజగారికి పాటల పూజ చేశానేమో అనిపిస్తోంది. నా కెరీర్లో కొంత గ్యాప్ వచ్చింది.. ఈ గ్యాప్‌ని ఫుల్‌ఫిల్ చేసేలా పదిహేను సినిమాలు చేస్తున్నాను. వాటిల్లో వచ్చే ఏడాది ఏప్రిల్‌లోపు పది సినిమాలు రిలీజవుతాయి’’ అన్నారు. -
‘ఊరికి ఉత్తరాన’ మూవీ రివ్యూ
టైటిల్ : ఊరికి ఉత్తరాన నటీనటులు : నరేన్ వనపర్తి, దీపాళ్లీ శర్మ, ఆనంద చక్రపాణి, రామరాజు, అంకిత్ కొయ్య, జగదీష్, ఫణి తదితరులు నిర్మాణ సంస్థ : ఈగల్ ఐ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు : వెంకటయ్య వనపర్తి, రాచల యుగేందర్ గౌడ్ దర్శకత్వం : సతీష్ పరమవేద సంగీతం : భీమ్స్ సెసిరోలియో సినిమాటోగ్రఫీ: శ్రీకాంత్ అరుపుల కథలో బలం ఉంటే చాలు.. హీరో ఎవరనేది పట్టించుకోకుండా థియేటర్స్‌కి వస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే విభిన్నమైన కాన్సెప్టులతో చిన్న సినిమాలు తెలుగు తెరను పలకరిస్తున్నాయి. అలా సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమే ‘ఊరికి ఉత్తరాన’. టైటిలే డిఫరెంట్‌గా ఉండడం, ఇటీవల విడుదలైన ట్రైలర్, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ‘ఊరికి ఉత్తరాన’పై అంచనాలు పెరిగాయి. ఎన్నో అంచనాల మధ్య ఈ శుక్రవారం(నవంబర్ 19)థియేటర్స్ ద్వారా ప్రేక్షకులను పలకరించిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే వరంగల్ జిల్లా పర్వతగిరి పెద్ద పర్వతనేని శంకర్ పటేల్ (రామరాజు) సోదరి ప్రేమ వివాహం చేసుకుంటుంది. తనకి ఇష్టంలేని వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కోపంతో.. ఆ యువకుడిని కాకతీయ తోరణానికి కట్టి ఉట్టి కొట్టిస్తాడు. ఇక ముందు ప్రేమ వివాహాలు చేసుకొనే ప్రతీ ఒక్కరికి ఇలాంటి శిక్షే ఉంటుందని గ్రామ ప్రజలను హెచ్చరిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన మేనకోడలు శైలు ( దీపాళీ శర్మ) పక్క ఊరికి చెందిన రాజు అలియాస్ కరెంట్ రాజు(నరేన్ వనపర్తి)ని ప్రేమిస్తుంది. ఓ కారణంగా వీరిద్దరు ఊరు విడిచి హైదరాబాద్‌కు పారిపోతారు. కానీ తెల్లారేసరికి శైలు పక్కన కనిపించదు. అసలు శైలు ఎక్కడికి వెళ్లింది? ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా లేదా మోసం చేసి పారిపోయిందా? 30 ఏళ్ల వయసులో కరెంట్ రాజు కాలేజీలో స్టూడెంట్‌గా ఎందుకు చేరాడు? శంకర్ పటేల్ గురించి తెలిసినా వారిద్దరు ప్రేమలో ఎలా మునిగిపోయారు? కరెంట్ రాజు, శైలు ప్రేమను శంకర్ పటేల్ అంగీకరించాడా? లేదా?అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే.. హీరో, హీరోయిన్లు కొత్త వాళ్లు అయినా బాగా నటించారు. అవారాగా తిరిగే కరెంట్ రాజు పాత్రలో నరేన్ ఒదిగిపోయాడు. బాధ్యత తెలియని యువకుడిగా, ప్రేమికుడిగా, కాలేజీ స్టూడెంట్‌గా పలు వేరియన్స్ ఉన్న పాత్రని అవలీలగా పోషించాడు. శైలుగా దీపాళీ తన పాత్ర పరిధి మేరకు ఆకట్టుకుంది. హీరో తండ్రి కరెంట్ నారాయణగా ఆనంద చక్రపాణి మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. నెగెటీవ్ షేడ్స్ ఉన్న పర్వతనేని శంకర్ పటేల్ పాత్రలో రామరాజు సరికొత్తగా కనిపించారు. సినిమాలో మరో బలమైన పాత్ర తనది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? ప్రేమకు మరణం లేదు కానీ ప్రేమిస్తే మరణమే.. అనే కాన్సెప్ట్ తో తెరకెక్కించిన సినిమా ఇది. యూత్‌కి కనెక్ట్ అయ్యే కథను ఎంచుకొని.. అనుకున్నది అనుకున్నట్లు తెరపై చూపించడంతో సఫలం అయ్యాడు దర్శకుడు సతీష్ పరమవేద. అతనికిది తొలి సినిమా అయినా ఎక్కడా కన్ఫ్యూజన్ కాకుండా, అనుభవజ్ఞుడు లా సుత్తి లేకుండా చెప్పాల్సిన పాయింట్ చెప్పాడు. రామరాజు, ఆనంద చక్రపాణి పాత్రలను ఎమోషనల్‌గా తీర్చిదిద్ది సినిమా స్తాయిని పెంచాడు. భారీ బడ్జెట్ చిత్రాలనే కాకుండా స్టార్ హీరోలను కూడా లీడ్ చేసే సత్తాను తన తొలి చిత్రంతోనే నిరూపించుకొన్నారు. అయితే సినిమాలో కొన్ని సాగదీత సీన్స్ మాత్రం ప్రేక్షకులకు ఇబ్బంది కలిగిస్తాయి. సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. భీమ్స్ సెసిరోలియో బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం మాత్రం అదరగొట్టేశాడు. శ్రీకాంత్ అరుపుల సినిమాటోగ్రఫి బాగుంది. కాకతీయ తోరణం సెట్టింగును తెరపైన అద్బుతంగా చూపించాడు. ఎడిటర్ శివ శ్రావణి తన కత్తెర ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని అనవసరపు సీన్స్‌ని కట్ చేస్తే సినిమా మరింత క్రిస్పీగా ఉంటుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘ఛలో ప్రేమిద్దాం’
`ప్రెజర్ కుక్కర్` ఫేమ్ సాయి రోనక్, `90 ఎమ్ ఎల్` ఫేమ్ నేహ సోలంకి జంటగా నటించిన తాజా చిత్రం ‘ఛలో ప్రేమిద్దాం’. హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై ఉదయ్ కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేష్ శేఖర్ రేపల్లె దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్‌తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఉదయ్ కిరణ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను గతంలో రాజీవ్ కనకాలతో `బ్లాక్ అండ్ వైట్`, వరుణ్ సందేశ్ హీరోగా `ప్రియుడు` చిత్రాలు నిర్మించాను. ప్రియుడు సినిమా సమయంలో సురేష్ పరిచయం. ఆ సమయంలోనే తను ఒక మంచి కథ చెప్పాడు . ఆ కథ నచ్చి ` ఛలో ప్రేమిద్దాం` చిత్రం నిర్మించాను. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రజంట్ ట్రెండ్ కు కనెక్టయ్యే అంశాలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది. ఇందులో మంచి లవ్ స్టోరితో పాటు థ్రిల్లింగ్ పాయింట్ ఉంది. దర్శకుడు సినిమాను చాలా బాగా డీల్ చేశారు. ఇది అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది’ అన్నారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ.... ‘ఈ చిత్రంలో పంచ భూతాల్లాంటి ఐదు పాటలున్నాయి. భీమ్స్ అంటే ఇప్పటి వరకు అందరూ మాస్ సాంగ్స్ అనుకునే వారు. కానీ, ఈ సినిమాతో భీమ్స్ మాస్ తో పాటు, మెలోడీ సాంగ్స్ కూడా అద్భుతంగా చేయగలడని ప్రూవ్ చేసే విధంగా పాటలుంటాయి. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా చాలా బాగా కుదిరింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడే సినిమా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఏర్పడింది. కచ్చితంగా ఛలో ప్రేమిద్దాం చిత్రం ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది’ అన్నారు. -
సినిమా రివ్యూ: గాలిపటం
నటీనటలు: ఆది, క్రిస్టినా అఖీవా, ఎరికా ఫెర్నాండెజ్, రాహుల్ రవీంద్రన్, పోసాని, హేమ, ప్రగతి, సప్తగిరి తదితరులు సినిమాటోగ్రఫి: కే.బుజ్జి సంగీతం: భీమ్స్ సెసిరోలియో కథ, స్క్రీన్ ప్లే: సంపత్ నంది నిర్మాతలు: సంపత్ నంది, కిరణ్ ముప్పవరపు, విజయకుమార్ వట్టికూటి దర్శకత్వం: నవీన్ గాంధీ ప్లస్ పాయింట్స్: డైలాగ్స్ ఫోటోగ్రఫి మైనస్ పాయింట్స్: కథ, కథనం దర్శకుడిగా టాలీవుడ్ లో సుపరిచితులైన సంపతి నంది నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం 'గాలిపటం'. రొమాంటిక్ లవ్ స్టోరికి 'పవనిజం' అనే ఎక్స్ ట్రా కోటింగ్ ఇచ్చి ప్రేక్షకుల్లో గాలిపటంపై అంచనాలు పెంచడంలో 'సంపత్ నంది' సఫలమయ్యారు. తన మార్కు డైలాగ్స్ తో యూత్ కు కనెక్ట్ అయ్యేలా నిర్మించామనే ప్రచారంతో ముందుకు వచ్చిన 'గాలి పటం' ప్రేక్షకుల అంచనాల మేరకు ఎగిరిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే! కార్తీక్(ఆది), స్వాతి(ఎరికా ఫెర్నాండెజ్) కొత్తగా పెళ్లై.. ఒకే కంపెనీలో పనిచేసే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. వ్యక్తిగత విభేదాల కారణంగా పెళ్లైన ఏడాదిలోపే స్నేహపూరితమైన వాతావరణంలో విడిపోవాలని నిర్ణయించుకుంటారు. ఈ నేపథ్యంలో పెళ్లికి ముందే కార్తీక్ కు పరిణిత (క్రిస్టినా) అమ్మాయితో ప్రేమ వ్యవహారం, స్వాతి జీవితంలో ఆరవ్ రెడ్డి (రాహుల్)తో అఫైర్ ఉన్నట్టు తెలుస్తుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లిని కాదనుకుని మాజీ ప్రియురాలితో కార్తీక్, ప్రియుడితో స్వాతి జీవించాలనుకుంటారు. ప్రేమను కాదని పెద్దలు కుదిర్చిన పెళ్లిని కార్తీక్ ఎందుకు చేసుకున్నాడు? అఫైర్ వదులుకుని స్వాతి కార్తీక్ ను ఎందుకు పెళ్లి చేసుకుంది? చివరకు ఆరవ్, స్వాతి, కార్తీక్, పరిణితలు ఒక్కటవుతారా? లేక స్వాతి, కార్తీక్ లే కలిసి ఉండాలని కోరుకుంటారా అనే ప్రశ్నలకు దర్శకుడు నవీన్ గాంధీతో కలిసి సంపత్ నంది ఇచ్చిన సమాధానమే 'గాలిపటం'. సమీక్ష: ప్రస్తుత సాఫ్ట్ వేర్ యుగంలో యువతీ, యువకుల తీరుతెన్నులను ప్రధాన అంశంగా చేసుకుని ప్రేమ, పెళ్లి అంశాలను జోడించి అల్లుకున్న కథకు సామాజిక అంశాలను అక్కడ జొప్పించడమే కాకుండా వినోదాత్మకంగా చెప్పాలని సంపత్ నంది, నవీన్ గాంధీ చేసిన ప్రయత్నం కొంత సపలమైందని చెప్పవచ్చు. అయితే గాలిపటం చిత్రంలో డైలాగ్స్ పై పెట్టినంత దృష్టి.. కథ, కథనాలపై మరికొంత కేర్ తీసుకుని ఉంటే సంపత్ నందికి మరింత భిన్నమైన ఫలితం లభించి ఉండేది. డైలాగ్స్ అక్కడ బ్రహ్మండంగా పేలాయి. కాని కొన్ని కీలక సన్నివేశాల్లో భావోద్వేగాన్ని డైలాగ్స్ ఓవర్ టేక్ చేసి ఇదేం గోలరా అనే ఫిలింగ్ కలుగుతుంది. కొన్ని సామాజిక అంశాలను తెరపై చూపించడానికి ఎంచుకున్న పద్దతి కరెక్ట్ కాదనిపించినా.. కమర్షియల్ అంశాలను మేళవించి.. చివరికి మంచి అంశాన్ని ప్రేక్షకులకు చేరవేశాడనే విషయం బోధపడుతుంది. బామ్మల సీన్ల కన్విన్స్ చేయడానికి కొంత ఇబ్బంది ఉన్నా, భార్గవి దంపతుల మధ్య సన్నివేశాలు ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించేలా ఉన్నాయి. అయితే ప్రీ క్లైమాక్స్ వరకు కథను బాలెన్స్ గా ముందుకు తీసుకుపోవడంలో సక్సెస్ అయ్యారు. అయితే క్లైమాక్స్ పాయింట్ ను చెప్పడానికి మధ్యలో వినోదం పేరుతో కొన్ని సీన్లను హడావిడిగా చేర్చినట్టు అనిపిస్తుంది. అయితే తాను ఎంచుకున్న ముగింపుకు చేరవేయడానికి జోడించిన ట్విస్టులు అంతగా మెప్పించలేకపోవడం ఓ మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఏదిఏమైనా తాను అల్లుకున్న పాయింట్ తో ఆది, క్రిస్టినా, ఎరికాల నుంచి మంచి నటనను రాబట్టుకున్నారు. ఆదికి ముఖ్యంగా కొంత నటనకు స్కోప్ ఉన్న పాత్రే లభించింది. రాహుల్ కు పెద్దగా ఉపయోగపడని, కెరీర్ కు తోడ్పాడనందించని పాత్రే దక్కింది. క్రిస్టినా, ఎరికాలు గ్లామర్ తో ఆకట్టుకున్నారు. ఇక మిగితా క్యారెక్టర్లు పర్వాలేదనిపించే రేంజ్ లో ఉన్నాయి. ఈ చిత్రానికి కే.బుజ్జి అందించిన సినిమాటోగ్రఫి, భీమ్స్ సంగీతం అదనపు ఆకర్షణ. సంపత్ నంది టీమ్ నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. చివరగా యూత్ కు కనెక్ట్ అయ్యే అంశాలు పుష్కలంగా ఉన్నా... ఫ్యామిలీ ఆడియెన్స్ ను థియేటర్ కు రప్పించడంపైనా 'గాలిపటం' విజయం ఆధారపడిఉంది. ట్యాగ్: తక్కువ వ్యాలిడిటితో ఎక్కువ రీఛార్జ్