భోపాల్: గుడి ఆవరణలో ఐటెం సాంగ్‌కు డ్యాన్స్ చేసినందుకు ఓ యువతి చిక్కుల్లో పడింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్ రూపంలో ఆ వీడియో వైరల్ కావడంతో దుమారం చెలరేగింది. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆ యువతిపై పోలీస్ కేసు నమోదు చేయాలని స్వయానా హోం మంత్రి ఆదేశించారు.
మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో ఓ దేవాలయం ఆవరణలో అభ్యంతకరంగా నృత్యం చేస్తూ.. సోషల్‌మీడియాలో వైరల్ చేసినందుకుగాను యువతిపై పోలీసు కేసు నమోదు చేయనున్నట్లు హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఈరోజు తెలిపారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన నేహా మిశ్రాకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అక్టోబర్ 1వ తేదీన ఆలయం ప్రాంగణంలో దబాంగ్ చిత్రంలోని మున్నీ బద్నాం హుయి సాంగ్‌పై డ్యాన్స్ చేసి.. ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేసింది.
అయితే గుడి ఆవరణలోని మెట్ల మీద.. చినిగిన జీన్స్‌తో ఆమె చేసిన డ్యాన్సులపై బజరంగ్ దళ్ ఈ వీడియోపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తన వీడియోపై విమర్శలు రావడంతో ఆమె క్షమాపణలు చెప్పింది. మతపరమైన మనోభావాలు దెబ్బ తీసినందుకు ఆ వీడియోను డిలీట్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే..
ఆమె క్షమాపణలపై హోం మంత్రి సానుకూలంగా స్పందించలేదు. ఆమె వస్త్రధారణ, అలా వీడియో తీయడం అభ్యంతకరకంగా ఉన్నాయి. గతంలో ఇలాంటి జరిగినప్పుడు చర్యలు తీసుకున్నాం. అయినా ఆమె పట్టించుకోకుండా వీడియో తీసింది. అందుకే ఆమెపై కేసు నమోదు చేయబోతున్నాం అని మిశ్రా మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఛతర్‌పూర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్‌కు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించినట్లు హోం మంత్రి మిశ్రా తెలిపారు.
छतरपुर में माता बम्बरबैनी मंदिर परिसर में आपत्तिजनक फिल्मांकन के खिलाफ एफआईआर दर्ज करने के निर्देश पुलिस अधीक्षक को दिए गए हैं। pic.twitter.com/X7euV9Z1qv
— Dr Narottam Mishra (@drnarottammisra) October 4, 2022
Comments
Please login to add a commentAdd a comment